Pooja Hegde: పూజ పాప వ్యాక్సిన్.. ఫోటోలు నెట్టంతా వైరల్!

అదేంటో సినిమా వాళ్ళు ఏం చేసినా అది పెద్ద వార్తయిపోతుంటుంది. నిజంగా వార్త కావాలనే వీళ్ళు ఇలా చేస్తారో.. లేక ప్రేక్షకులే వీరు చేసే పనిని వార్త చేస్తారో కానీ..వీళ్ళకి కావాల్సిన ప్రచారం మాత్రం అయిపోతుంది. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే హీరోయిన్ పూజ హెగ్డే తాజాగా తన తొలిదశ కరోనా వ్యాక్సిన్ తీసుకుంది.

Pooja Hegde: పూజ పాప వ్యాక్సిన్.. ఫోటోలు నెట్టంతా వైరల్!

Pooja Hegde

Pooja Hegde: అదేంటో సినిమా వాళ్ళు ఏం చేసినా అది పెద్ద వార్తయిపోతుంటుంది. నిజంగా వార్త కావాలనే వీళ్ళు ఇలా చేస్తారో.. లేక ప్రేక్షకులే వీరు చేసే పనిని వార్త చేస్తారో కానీ..వీళ్ళకి కావాల్సిన ప్రచారం మాత్రం అయిపోతుంది. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే హీరోయిన్ పూజ హెగ్డే తాజాగా తన తొలిదశ కరోనా వ్యాక్సిన్ తీసుకుంది. వ్యాక్సిన్ తీసుకొంటే మంచిదే కదా దానికి ఇంత వైరల్ ఎందుకు అనుకుంటున్నారా.. అక్కడే ఉంది పూజ పాప మ్యాజిక్.

వ్యాక్సిన్ వేయించుకుంటూ ఫోటో తీయించి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే క్షణాల్లో ఆ ఫోటోలు కాస్త వైరల్ అయింది. ఫోటోల్లో అంత క్యూట్ గా ఉంది మరి. స్లీవ్‌లెస్ టాప్‌లో మాస్క్ పెట్టుకున్న పూజాహెగ్డే..”మీ న‌వ్వుతో భ‌యాన్ని దాచిపెట్టండి” అంటూ క్యాప్ష‌న్ ఇచ్చి మరీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇందులో చూసేందుకు పూజ కాస్త ముద్దుగా ఉంటూనే కాస్త హాట్ గా కనిపించడంతో ఇప్పుడీ స్టిల్ నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికొస్తే ప్ర‌స్తుతం అన్ని బాషలలో స్టార్ హీరోల సినిమాల‌తో బిజీగా ఉంది. ఈ బ్యూటీ ఖాతాలో రాధేశ్యామ్‌, ఆచార్య‌, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్, బీస్ట్ చిత్రాలు ఉండగా.. రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్, ఆచార్య‌ చిత్రాలు విడుద‌ల‌కు సిద్దంగా ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ తో చేస్తున్న బీస్ట్ షూటింగ్ ద‌శ‌లో ఉంది.