Pooja Hegde : బుట్టబొమ్మ డేట్స్ దొరకాలంటే కష్టమే..

రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య లాంటి ఫ్లాప్ సినిమాల తర్వాత బుట్టబొమ్మ పూజాహెగ్డే భవిష్యత్ ఏంటి అని చాలా మంది ఆలోచించారు. కానీ...............

Pooja Hegde : బుట్టబొమ్మ డేట్స్ దొరకాలంటే కష్టమే..

Pooja Hegde

Pooja Hegde :  రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య లాంటి ఫ్లాప్ సినిమాల తర్వాత బుట్టబొమ్మ పూజాహెగ్డే భవిష్యత్ ఏంటి అని చాలా మంది ఆలోచించారు. కానీ చాలామంది అనుకుంటున్నట్టు ఏమీ లేదు. అంతేకాక బుట్టబొమ్మ డేట్స్ దొరకాలంటే కష్టంగా మారిందిప్పుడు. అవును ఆఫర్స్ ఎక్కువ కావడంతో పెద్ద పెద్ద సినిమాలనే వదిలేస్తోంది పూజా హెగ్డే. బిజీ క్వీన్ అయిపోయింది జిగేలు రాణి. ఆఫర్స్ ఎక్కువ, డేట్స్ తక్కువ అన్నట్టు తయారైంది పూజా లైఫ్. డేట్స్ కుదరకపోవడంతో బిగ్ ప్రాజెక్టుల నుంచి తప్పుకుంటోంది.

నిజానికి రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య లాంటి సినిమాల ఫ్లాప్స్ తర్వాత పూజా హెగ్డేపై మళ్లీ ఐరన్ లెగ్ ముద్ర వేసారు కొందరు. కానీ సినిమాల్లో విషయం లేకపోతే అది తన తప్పు కాదంటూ బంపర్ ఛాన్స్ లు కొట్టేస్తుంది. ఎటొచ్చి కాల్ షీట్స్ ఇష్యూస్ కారణంగా పవర్ స్టార్ పక్కన మెరిసే అవకాశాన్ని చేజార్చుకుంది. భవదీయుడు భగత్ సింగ్ లో పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశాన్ని పూజా హెగ్డేకే ఇచ్చాడు హరీశ్ శంకర్. ఈ సినిమా కోసం హరీశ్ తో పాటూ ఎప్పటినుంచో పూజా కూడా వెయిట్ చేస్తోంది. స్ట్రిప్ట్ సిద్ధమై క్యాస్టింగ్ కూడా హరీశ్ శంకర్ రెడీ చేసుకున్నా ఎంతకీ పవన్ కల్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావట్లేదు. హరిహర వీరమల్లు, వినోదయ సిత్తం తర్వాత హరీశ్ మూవీని పవన్ ఎప్పుడు పట్టాలెక్కిస్తారో తెలియదు. ఇటు చూస్తే పూజాకు కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి. సో ఇష్టం లేకపోయినా పవన్ మూవీ నుంచి డ్రాప్ అయినట్టు తెలుస్తోంది.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ గే సినిమానా?? వాళ్ళకి ఇలా అర్థమైందా?? ఆర్జీవీ చెప్పింది నిజమేనా??

ప్రస్తుతం మహేశ్-త్రివిక్రమ్, విజయ్ దేవరకొండ – పూరీ లాంటి క్రేజీ కాంబినేషన్ మూవీల్లో పూజానే లాక్ చేసారు. అటు బాలీవుడ్ లో రణవీర్ సింగ్ సర్కస్ మూవీని పూర్తి చేసి సల్మాన్ కభీ ఈద్ కభీ దివాళీ షూటింగ్ లో పాల్గొంటుంది. ఇక హీరోయిన్ కోసం వెతుకుతున్న తారక్ – కొరటాల శివ చివరికి పూజానే ఫైనల్ చేసినా ఆశ్చర్యం లేదు. మరికొన్ని టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. సో బుట్టబొమ్మ డేట్స్ దొరకాలంటే ప్రస్తుతం కష్టం అయిపొయింది మరి.