Pooja Hegde : వారందరికి తియ్యని కానుకలు పంపుతున్న బుట్టబొమ్మ

ఇండస్ట్రీ వ్యక్తులతో మంచి సంబంధాలు మెయింటెయిన్ చేయడంలో హీరోయిన్ పూజా హెగ్డే ఎప్పుడూ ముందు ఉంటుంది. పారితోషికం లేదా కాల్ షీట్ల విషయంలో అస్సలు ఇబ్బంది పెట్టదు. ఏదో విధంగా అడ్జస్ట్ చేస్తుంది. ఇప్పుడా విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది. పరిశ్రమలో తెలిసిన వారందరికి పూజ.. గిఫ్ట్ లు పంపుతోంది. అవేంటో తెలుసా..

Pooja Hegde : వారందరికి తియ్యని కానుకలు పంపుతున్న బుట్టబొమ్మ

Pooja Hegde

Pooja Hegde : ఇండస్ట్రీ వ్యక్తులతో మంచి సంబంధాలు మెయింటెయిన్ చేయడంలో హీరోయిన్ పూజా హెగ్డే ఎప్పుడూ ముందు ఉంటుంది. పారితోషికం లేదా కాల్ షీట్ల విషయంలో అస్సలు ఇబ్బంది పెట్టదు. ఏదో విధంగా అడ్జస్ట్ చేస్తుంది. ఇప్పుడా విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది. పరిశ్రమలో తెలిసిన వారందరికి పూజ.. గిఫ్ట్ లు పంపుతోంది. అవేంటో తెలుసా.. మామిడి పండ్లు.

పూజా హెగ్డేకు మంగళూరు దగ్గర మామిడి తోట ఉంది. ఈ సారి మంచి దిగుబడి వచ్చింది. అందుకే.. టాలీవుడ్ లోని పలువురికి మామిడిపళ్ల గిఫ్ట్ హ్యాంపర్లు తన మేనేజర్ ద్వారా పంపిణీ ప్రారంభించింది. తొలి రోజు ఒకరిద్దరు నిర్మాతలకు, దర్శకులకు గిఫ్ట్ లు అందాయి. రేపటి నుంచి వరుసగా చాలా మందికి అంద చేయడానికి ఏర్పాట్లు చేశారు. ముందుగా అందుకున్న వారిలో దర్శకుడు త్రివిక్రమ్ ఉన్నారు. ఇంకా అందాల్సిన వారు చాలా మందే ఉన్నారు. హరీష్ శంకర్, మైత్రీ, యువి, గీతా, ఇంకా పలువురు హీరోలు, దర్శకులు జాబితాలో ఉన్నారని తెలుస్తోంది.