Pooja Hegde : కొత్త ఇంట్లోకి పూజా హెగ్డే.. ముంబైలో సూపర్ హౌస్..

తాజాగా పూజ హెగ్డే ఓ ఇల్లు కొన్నారంట. ముంబైలో బాగా ఖర్చు పెట్టి సూపర్ హౌస్ ని కొనుగోలు చేసింది పూజ. పూజ కొన్న ఇంటిని తన అభిరుచికి తగ్గట్లుగా ఇప్పుడు డిజైన్‌ చేయించుకుంటున్నారు.

Pooja Hegde : కొత్త ఇంట్లోకి పూజా హెగ్డే.. ముంబైలో సూపర్ హౌస్..

Pooja

Pooja Hegde :  పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు. వరుస హిట్లు కొడుతూ టాలీవుడ్ లో చాలా మంది హీరోలకి లక్కీ చామ్ అయింది. ఇటీవలే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో వచ్చి విజయం సాధించింది. ప్రస్తుతం పూజా హెగ్డే డైరీ అస్సలు ఖాళీ లేదంట. టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ.. మధ్య మధ్యలో తమిళ్ సినిమాలు కూడా ఒప్పుకుంటూ.. బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరసన వరుస సినిమాలతో బిజీగా ఉంది పూజ. పూజ పట్టింది బంగారం అన్నట్టు అవుతుంది. పూజ డేట్స్ కోసం స్టార్ హీరోలు, డైరెక్టర్స్ ఎదురు చూస్తున్నారు. ఇలా బిజీ బిజీగా సినిమాలు చేస్తూ బాగానే సంపాదిస్తుంది. ఇటీవలే తన రెమ్యూనరేషన్ కూడా పెంచినట్టు సమాచారం.

Bommarillu Bhaskar : మళ్ళీ మెగా కాంపౌండ్ లోకి బొమ్మరిల్లు భాస్కర్.. మెగా హీరోతో సినిమా??

తాజాగా పూజా హెగ్డే ఓ ఇల్లు కొన్నారంట. ముంబైలో బాగా ఖర్చు పెట్టి సూపర్ హౌస్ ని కొనుగోలు చేసింది పూజ. పూజ కొన్న ఇంటిని తన అభిరుచికి తగ్గట్లుగా ఇప్పుడు డిజైన్‌ చేయించుకుంటున్నారు. ఇంటీరియర్‌ డిజైన్, కలర్‌ వంటి విషయాలను దగ్గరుండి పూజా హెగ్డేనే చూసుకుంటుంది. ప్రస్తుతం షూటింగ్స్ లో గ్యాప్ వస్తే తన కొత్త ఇంటి పనులు చూసుకుంటుందంట పూజ. తన ఇంటికి సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి.. నా కలలను నిర్మించుకుంటున్నాను అని పోస్ట్ చేసింది. దీంతో త్వరలో ముంబైకి మకాం మారుస్తుంది అని అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)