‘రాములో..రాములా’.. ఫన్ షాట్ షేర్ చేసిన పూజా..

  • Published By: sekhar ,Published On : August 19, 2020 / 08:51 PM IST
‘రాములో..రాములా’.. ఫన్ షాట్ షేర్ చేసిన పూజా..

Pooja Hegde Rememebers fun shot: ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిత్రం.. ‘అల వైకుంఠపురంలో..’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమేకాక నాన్ బాహుబలి రికార్డ్ కూడా క్రియేట్ చేసింది. డైరెక్టర్ త్రివిక్రమ్ టేకింగ్, డైలాగులు, అల్లు అర్జున్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్‌తోపాటు తమన్ సంగీతం కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇటీవల ఈ సినిమా బుల్లితెరపై కూడా సందడి చేసింది.



ఈ సందర్భంగా హీరోయిన్ పూజా హెగ్డే ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. సూపర్ హిట్ సాంగ్ ‘రాములో.. రాముల..’ పాటలో బన్నీ, పూజ, సుశాంత్, నివేదాపై చిత్రీకరించిన ఓ షాట్‌ను అభిమానులతో పంచుకుంది. ‘‘రాములో.. రాముల..’’ పాటలోని ఫన్ షాట్. ఇది సింగిల్ షాట్. అందరి టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్ అద్భుతంగా కుదిరాయి’ అంటూ వీడియో షేర్ చేయగా ఇప్పటికే రెండు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.



https://www.instagram.com/p/CD9QexMnN8d/?utm_source=ig_web_copy_link