Pooja Hegde: నేను తెలుగమ్మాయినే.. అలా పిలిస్తేనే ఇష్టం!

ముంబైలో హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ అయ్యి సౌత్ స్టార్ హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉన్న పూజా హెగ్డే.. వరుసగా సక్సెస్ లు కొడుతూ డబుల్ హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతోంది.

Pooja Hegde: నేను తెలుగమ్మాయినే.. అలా పిలిస్తేనే ఇష్టం!

Pooja

Pooja Hegde: ముంబైలో హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ అయ్యి సౌత్ స్టార్ హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉన్న పూజా హెగ్డే.. వరుసగా సక్సెస్ లు కొడుతూ డబుల్ హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతోంది. బాలీవుడ్ హీరోయిన్ అయినా కూడా తెలుగు అమ్మాయిగా పిలిపించుకోడానికే ఇష్టపడుతోంది ఈ హ్యాపెనింగ్ హీరోయిన్.

Romantic: నో డౌట్.. ఇది మ్యాడ్లీ లవ్.. రొమాంటిక్ ట్రైలర్ అదిరిందంతే!

బేసిక్ గా సౌత్ అమ్మాయైనా వెళ్లి బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది పూజాహెగ్డే. ముంబైలోనే హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి అక్కడే హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ అయ్యింది. స్టార్టింగ్ లోనే హృతిక్ రోషన్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకుని బాలీవుడ్ హీరోయిన్ అనిపించుకున్న పూజాకి మాత్రం తెలుగు అమ్మాయి అని పిలిపించుకుంటేనే ఇష్టమంటోంది.

Manasantha Nuvve: 20 ఏళ్ల ఎవర్‌గ్రీన్‌ ప్రేమకథా చిత్రం ‘మనసంతా నువ్వే’!

బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే తెలుగులో ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే.. ఫస్ట్ సినిమా ఒక లైలా పెద్దగా ఆడకపోయినా.. రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గరనుంచి హిట్లతో రఫ్ ఆడించేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటి వరకూ ఏ హీరోయిన్ కీ ఇలా ఒకేసారి స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ దక్కలేదు. తెలుగులో సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్ అయ్యింది కాబట్టే ముంబైలో అందరూ తెలుగుమ్మాయి అంటారంటోంది పూజా. అంతేకాదు తెలుగు అమ్మాయి అనిపించుకోవడానికే ఇష్టపడతానంటోంది.

Liger: బాంబే బ్యూటీకి రౌడీహీరో ఫిదా.. అద్భుతమంటూ ప్రశంసల వర్షం!

స్టార్ స్టేటస్ ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీనే.. ప్రజెంట్ ఇలాంటి స్టేజ్ లో ఉన్నానంటే తెలుగు సినిమానే కారణం అంటూ చాలా హంబుల్ గా తన సక్సెస్ క్రెడిట్ మొత్తం తెలుగుసినిమాకి ఇచ్చేస్తోంది ఈ బుట్టబొమ్మ. ప్రజెంట్ తెలుగులో స్టార్ హీరోలందరితో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ అటు తమిళ్ లో విజయ్ తో, కన్నడలో కూడా సినిమా చేస్తోంది. ఇలా సౌత్ లో, నార్త్ లో ఎన్ని సినిమాలు చేసినా.. తెలుగు అమ్మాయినే అంటోంది ఈ బుట్టబొమ్మ.