Pooja Hegde : ఇప్పటిదాకా నేను చేసిన సినిమాల్లో ఇదే చాలా క్లిష్టమైంది

పూజా హెగ్డే రాధేశ్యామ్ గురించి మాట్లాడుతూ.. ''విభిన్నమైన లవ్‌ స్టోరీస్‌లలో నటించాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. 'రాధేశ్యామ్‌' సినిమాతో నా కల నెరవేరింది. 'రాధేశ్యామ్‌' సినిమాలో..

Pooja Hegde :  ఇప్పటిదాకా నేను చేసిన సినిమాల్లో ఇదే చాలా క్లిష్టమైంది

Pooja Hegde

 

Pooja Hegde :   ఈ సంక్రాంతికి వస్తాయన్న పాన్‌ ఇండియా సినిమాలన్ని కరోనా ప్రభావంతో వాయిదా పడ్డాయి. అందులో ‘రాధేశ్యామ్’ కూడా ఒకటి. ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రభాస్ సొంత బ్యానర్ యూవీ క్రియేషన్స్ లో ఈ సినిమా నిర్మితమైంది. ఈ సంక్రాంతికి కానుకగా జనవరి 14న సినిమా రిలీజ్ చేద్దామనుకున్నారు మేకర్స్. కానీ కరోనా వల్ల సినిమా వాయిదా పడింది. కరోనా కేసులు తగ్గాక ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడింది.

Deepthi Sunaina : నేను ఒంటరి కాదు.. తండ్రితో ఎమోషనల్ వీడియోని షేర్ చేసిన దీప్తి సునైనా

పూజా హెగ్డే రాధేశ్యామ్ గురించి మాట్లాడుతూ.. ”విభిన్నమైన లవ్‌ స్టోరీస్‌లలో నటించాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. ‘రాధేశ్యామ్‌’ సినిమాతో నా కల నెరవేరింది. ‘రాధేశ్యామ్‌’ సినిమాలో ప్రేరణగా నటించడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఇందులో హీరోయిన్‌ రోల్‌ అద్భుతంగా ఉంటుంది. నాకు తెలిసినంతవరకు ఇప్పటిదాకా నేను చేసిన సినిమాల్లో ‘రాధేశ్యామ్‌’ చాలా క్లిష్టమైనది. ఇది ఒక పీరియాడికల్‌ సినిమా కావడంతో ప్రేరణ పాత్రలో జీవించడానికి ఎంతో రీసెర్చ్‌ చేశాను” అని పూజా హెగ్డె తెలిపింది.