Poojahegde : బాలీవుడ్ లో నేను చేసిన చెత్త సినిమా అది.. దానివల్ల నాకు ఆఫర్స్ రాలేదు..

పూజా హెగ్డే మాట్లాడుతూ.. ''బాలీవుడ్ లో నా డెబ్యూ సినిమా మొహంజొదారో సినిమా బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ అయింది. నా కెరీర్‌లో అది ఒక చెత్త సినిమాగా నిలిచింది. ఆ సినిమా........

Poojahegde : బాలీవుడ్ లో నేను చేసిన చెత్త సినిమా అది.. దానివల్ల నాకు ఆఫర్స్ రాలేదు..

Poojahegde :  ప్రస్తుతం పూజాహెగ్డే ఫుల్ ఫామ్ లో ఉంది. ఫ్లాప్స్ వచ్చినా వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ్, హిందీలలో దాదాపు అరడజనుపైగా సినిమాలు ఉన్నాయి పూజా చేతిలో. మొదట్లో పూజాని ఐరన్ లెగ్ అని కూడా అన్నారు. కానీ ఇప్పుడు ఫ్లాప్స్ వచ్చినా హీరోలు, దర్శకులు, నిర్మాతలు పూజా వైపే పరిగెడుతున్నారు. ఒకపక్క హీరోయిన్ గా చేస్తూనే మరో పక్క స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ బిజీబిజీగా ఉంది పూజా హెగ్డే. తాజాగా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ లో ఓ చెత్త సినిమా చేశానని, దాని వల్ల నాకు ఒక సంవత్సరం వరకు ఆఫర్స్ రాలేదని చెప్పింది పూజా.

Eeswar Movie : ప్రభాస్ 20 ఏళ్ళు.. ప్రభాస్ గురించి కృష్ణంరాజు వ్యాఖ్యలు..

పూజా హెగ్డే మాట్లాడుతూ.. ”బాలీవుడ్ లో నా డెబ్యూ సినిమా మొహంజొదారో సినిమా బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ అయింది. నా కెరీర్‌లో అది ఒక చెత్త సినిమాగా నిలిచింది. ఆ సినిమా వల్ల నాకు ఏడాది పాటు ఆఫర్స్‌ కూడా రాలేదు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఐరన్‌ లెగ్‌ అని కూడా అన్నారు. కానీ తెలుగులో వరుస విజయాలు వరించాయి. ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి” అని తెలిపింది. మరి ఆ సినిమాని చెత్త సినిమా అన్నందుకు మొహంజొదారో చిత్ర యూనిట్ కానీ బాలీవుడ్ వాళ్ళు కానీ ఎలా స్పందిస్తారో చూడాలి.