Pooja Hegde : పూజాహెగ్డే వెంకటేష్‌తో ఇక్కడ స్పెషల్ సాంగ్.. అక్కడ చెల్లెలుగా..

ఇక్కడ వెంకటేష్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేసి పూజా బాలీవుడ్ లో వెంకటేష్ కి చెల్లెలుగా కనిపించబోతుంది. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘కభీ ఈద్‌ కభీ దివాళి’ సినిమా చేస్తున్నాడు. ఇందులో పూజా హెగ్డే........

Pooja Hegde : పూజాహెగ్డే వెంకటేష్‌తో ఇక్కడ స్పెషల్ సాంగ్.. అక్కడ చెల్లెలుగా..

Poojaa

Pooja Hegde :  ప్రస్తుతం పూజాహెగ్డే సూపర్ ఫామ్ లో ఉంది. తమిళ్, తెలుగు, హిందీలో వరుసగా సినిమాలు చేస్తుంది. ఒక పక్క హీరోయిన్ గా చేస్తూనే, మరో పక్క స్పెషల్ సాంగ్స్ చేస్తుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న ‘ఎఫ్‌3’ సినిమాలో పూజాహెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సాంగ్ ప్రోమో కూడా రిలీజ్ అయింది. అయితే ఇక్కడ వెంకటేష్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేసి పూజా బాలీవుడ్ లో వెంకటేష్ కి చెల్లెలుగా కనిపించబోతుంది.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌, వెంకటేష్ ఎప్పట్నుంచో మంచి స్నేహితులు అని అందరికి తెలిసిందే. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘కభీ ఈద్‌ కభీ దివాళి’ సినిమా చేస్తున్నాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ సినిమాలో వెంకటేష్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. సల్మాన్ ఖాన్ తో ఉన్న సాన్నిహిత్యం మేరకు సల్మాన్ అడగడంతో వెంకటేష్ ఈ సినిమాలో చేయడానికి ఒప్పుకున్నాడు.

Mahesh Babu : సర్కారు వారి పాట సక్సెస్ సెలబ్రేషన్స్ ఫొటోలు

 

అయితే ఈ సినిమాలో వెంకటేష్ చేయబోయేది పూజాకి అన్నయ్య పాత్ర అని బాలీవుడ్ వర్గాల సమాచారం. దీంట్లో వెంకటేష్, పూజా అన్నా చెల్లెళ్లుగా నటించనున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడేమో వెంకటేష్ తో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసి అక్కడ చెల్లెలుగా నటిస్తే ఆడియన్స్ ఎలా తీసుకుంటారా అని సినీ వర్గాలు ఆలోచిస్తున్నాయి. కానీ వీరిద్దరూ ఆ పాత్రలు చేయడానికి సిద్దమైపోయినట్టు సమాచారం.