Pooja Hegde : కరీనాకు పూజా పాప సపోర్ట్..

వాళ్ల పనే ఏదో ఒకటి అనడం అంటూ కాస్త గట్టిగానే కౌంటరిచ్చింది బుట్టబొమ్మ..

Pooja Hegde : కరీనాకు పూజా పాప సపోర్ట్..

Pooja Hegde

Pooja Hegde: మాకేం తక్కువ.. మేం మాత్రం కష్టపడట్లేదా..? హీరోలు అడిగితే డిమాండ్.. మేం అడిగితే యాటిట్యూడ్ అని ఎందుకంటారని క్వశ్చన్ చేస్తోంది పూజా హెగ్డే. బాలీవుడ్‌లో కరీనా కపూర్ రెమ్యునరేషన్ మీద, ‘బాయ్ కాట్ బెబో’ ఇష్యూ మీద పూజా హెగ్డే ఇప్పుడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి.

హీరోయిన్స్‌కి స్క్రీన్ స్పేస్‌తో పాటు స్క్రీన్ స్పాన్ కూడా తక్కువే. బాలీవుడ్ హీరోయిన్ కరీనా మాత్రం పెళ్లయ్యి ఇద్దరు పిల్లలున్నా కూడా ఇంకా వరుస పెట్టి ఆఫర్లతో ఫుల్ బిజీ అవుతోంది. విజయేంద్ర ప్రసాద్ కథకి, అలౌకిక్ దేశాయ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ ‘సీత’ కు సంబంధించి టైటిల్ రోల్ కోసం కరీనా కపూర్‌ని అప్రోచ్ అయ్యితే, ‘సీత’ క్యారెక్టర్ చెయ్యడానికి ఏకంగా 12 కోట్ల రెమ్యునరేషన్ అడిగిందని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయ్యింది. లేటెస్ట్‌గా ఆ ఇష్యూ మీద పూజా హెగ్డే కామెంట్స్ అంతకంటే సెన్సేషన్ అవుతోంది.

Pooja Hegde : పూజా హెగ్డే పార్టీ స్టైలే వేరు..!

జనరల్‌గా సినిమాలకు 6 నుంచి 8 కోట్ల వరకు తీసుకునే కరీనా ఇప్పుడు డబుల్ రేట్ అడగడంతో నెటిజన్స్ ఫుల్‌గా సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. ‘బాయ్ కాట్ బెబో’ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్ వైరల్ చేశారు. అంతే కాదు, ఏ సినిమాలోనూ కరీనాని తీసుకోవద్దంటూ కామెంట్స్ కూడా పెట్టారు నెటిజన్స్. అంతే, ఈ ఇష్యూ మీద కరీనా కపూర్ పెద్దగా రియాక్ట్ అవ్వకపోయినా.. పూజా హెగ్డే మాత్రం కాస్త సీరియస్‌గానే తీసుకుంది. ఆవిడ డిమాండ్ చేస్తే మీకేంటి..? తన వాల్యూ అంత ఉందని కరీనా ఫీలయ్యింది కాబట్టే.. అన్ని కోట్లు అడిగింది.. దాన్లో తప్పేంలేదంటూ కరీనాకి సపోర్ట్‌గా నిలుస్తోంది పూజా.

ఈ మధ్య పూజా హెగ్డే కూడా ఇలా రెమ్యునరేషన్ పెంచేసిందనే ఇష్యూలోనే సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కి గురైంది. 2, 3 హిట్లొచ్చాయో లేదో.. అప్పడే 3 కోట్లు డిమాండ్ చేస్తోందా..? అంటూ రకరకాల కామెంట్స్ చేశారు నెటిజన్స్. అందుకే జనాలు ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు.. వాళ్ల పనే ఏదో ఒకటి అనడం అంటూ కాస్త గట్టిగానే కౌంటరిచ్చింది బుట్టబొమ్మ.