Pooja Hegde: పూజా ఫిక్స్ అయ్యింది.. మహేష్ అండ్ కో కోసమే వెయిటింగ్!

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్‌లో సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఈ బ్యూటీ ఇప్పటికే స్టార్ హీరో మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB28 మూవీలో పూజా హీరోయిన్‌గా సెలెక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని, ఇప్పుడు రెండో షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది.

Pooja Hegde: పూజా ఫిక్స్ అయ్యింది.. మహేష్ అండ్ కో కోసమే వెయిటింగ్!

Pooja Hegde To Join SSMB28 Shooting From Dec 15

Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్‌లో సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఈ బ్యూటీ ఇప్పటికే స్టార్ హీరో మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB28 మూవీలో పూజా హీరోయిన్‌గా సెలెక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని, ఇప్పుడు రెండో షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది.

Pooja Hegde : బుట్టబొమ్మకి కలిసిరాని 2022.. ఇయర్ ఎండింగ్ అయినా హిట్ కొడుతుందా?

అయితే ఈ సినిమా రెండో షెడ్యూల్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ షెడ్యూల్‌కు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను డిసెంబర్ 15న ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యిందని.. ఈ షెడ్యూల్‌లో పూజా హెగ్డే కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

SSMB28: మహేష్ బాబు సినిమా అందుకే ఆలస్యం అవుతుందా..?

ఇటీవల ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం చిత్ర యూనిట్ దుబాయ్ వెళ్లింది. వారు తిరిగి హైదరాబాద్ రాగానే, డిసెంబర్ 15 నుంచి ఈ సినిమా సెకండ్ షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మరి పూజాకు ఈ సినిమాలో ఎలాంటి పాత్ర దక్కుతుందా, ఆమె ఈ సినిమాలో అందాల ఆరబోత ఏ రేంజ్‌లో చేయనుందా అని ఆమె అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు.