Pooja Hegde: రౌడీ స్టార్‌తో రొమాన్స్‌కు బుట్టబొమ్మ రెడీ..?

స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస ఫ్లాపులతో సతమతమవుతోంది. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ, ఇటీవల రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య చిత్రాలతో...

Pooja Hegde: రౌడీ స్టార్‌తో రొమాన్స్‌కు బుట్టబొమ్మ రెడీ..?

Pooja Hegde To Romance Vijay Devarakonda In Jgm

Pooja Hegde: స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస ఫ్లాపులతో సతమతమవుతోంది. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ, ఇటీవల రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య చిత్రాలతో హ్యాట్రిక్ ఫ్లాపులు మూటగట్టుకుంది. అయితే ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్‌కు ఈ మూడు ఫ్లాపులు ఏమాత్రం అడ్డంగా మారలేదు. దీంతో పూజా ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెట్టి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో ‘కభీ ఈద్ కభీ దివాలీ’ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్న పూజా, టాలీవుడ్‌లోనూ పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటించనుంది.

Pooja Hegde: ఆగని పూజా జోరు!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోయే సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు ఇప్పటికే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రాబోతున్న భవదీయుడు భగత్‌సింగ్ చిత్రంలోనూ పూజా హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యింది. అయితే ఈ సినిమాలతో పాటు తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టులో కూడా పూజా హీరోయిన్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

Pooja Hegde: పడిపోతున్న బుట్టబొమ్మ గ్రాఫ్.. ఆ ఇద్దరిపైనే పుట్టెడు ఆశలు!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కాంబినేషన్‌లో ఇప్పటికే లైగర్ చిత్రం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాకముందే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘జనగణమన’ అనే మరో ప్రాజెక్టు కూడా పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజాను సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో పూజా రొమాంటిక్ ట్రాక్ ఓ రేంజ్‌లో ఉంటుందని, ఇందులో బోల్డ్ సీన్స్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా వరుసగా బ్యాక్ టు బ్యాక్ సూపర్ క్రేజీ ప్రాజెక్టులను చేజిక్కించుకుంటున్న పూజా, రౌడీస్టార్‌తో ఎలాంటి రొమాన్స్‌ను పండిస్తుందో చూడాలి.