Poonam Kaur: బావ మూవీ హిట్.. పూనమ్ కౌర్ పోస్ట్ వైరల్!
నటి పూనమ్ కౌర్ ఆ మధ్య ట్వీట్లతోనే సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసి తర్వాత మళ్ళీ సైలెంట్ మోడ్ లో ఉండిపోయింది. కానీ ఈ మధ్య మళ్ళీ ఏదొక ట్వీట్ తో తెగ హాట్ టాపిక్‌గా మారుతుంది.

Poonam Kaur: నటి పూనమ్ కౌర్ ఆ మధ్య ట్వీట్లతోనే సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసి తర్వాత మళ్ళీ సైలెంట్ మోడ్ లో ఉండిపోయింది. కానీ ఈ మధ్య మళ్ళీ ఏదొక ట్వీట్ తో తెగ హాట్ టాపిక్‌గా మారుతుంది. ఇప్పుడు మరోసారి ఈ అమ్మడు చేసే ట్వీట్స్ నెట్టింట తెగ రచ్చ చేస్తున్నాయి. పూనమ్ కౌర్ షేర్ చేసిన ఓ స్క్రీన్ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బావ సినిమాకి వచ్చాను అక్కా అంటూ ఎవరో ఆమెతో చాట్ చేసిన స్క్రీన్ షాట్ లను పంచుకుంది.
Bheemla Nayak: పవర్ ప్యాక్డ్ ఈగో క్లాష్.. హీరో వర్సెస్ విలన్!
దానికి ఆమె కూడా ఓకే అన్నట్లుగా కళ్ళు మూసుకున్న ఎమోజీలను పెడుతూ.. సినిమా ఎలా ఉందో చెప్పమని హానెస్ట్ రివ్యూ ఇవ్వమని పూనమ్ అడుగుతోంది. దానికి అవతలి వ్యక్తి కూడా ఒకే అన్నారు. ఆ తర్వాత అతను సినిమా హిట్టు నిజంగా చెప్తున్నా అక్కా సినిమా సూపర్ హిట్టు అంటూ చాట్ చేశాడు. ఇది ఎవరితో ఆమె చాట్ చేసిందో.. ఏ సినిమా గురించి వీళ్ళు మాట్లాడుకున్నారో.. చాట్ చేసిన వ్యక్తి ఏ సినిమాకి వెళ్ళాడో.. ఇంతకీ ఈ బావ ఎవరన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Bheemla Nayak: థియేటర్లలో భీమ్లా నాయక్.. మొదటి రోజే 10 వేలకు పైగా షోలు
ఇక.. ఇదంతా ఏ సినిమా గురించో నెటిజన్లు ఎవరికి వారు అవగాహనకు వచ్చేసి.. బావ సినిమా సూపర్ హిట్టు అక్కా అంటూ పూనమ్ కు రిటర్న్ కామెంట్లు పెడుతున్నారు. కాగా, పూనమ్ గతంలో టాలీవుడ్ లోని ప్రముఖులపై, హీరోలపై కొన్ని వివాదాస్పద ట్విట్లు చేసిన సంగతి తెలిసిందే కాగా.. ఓ మూవీ క్రిటిక్ కూడా పూనమ్ కు ఏదో అన్యాయం జరిగిపోయిందని పెద్ద ఎత్తున దుమారం రేపిన సంగతి కూడా తెలిసిందే.
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) February 25, 2022