K Muralidharan : ప్రముఖ సినీ నిర్మాత మృతి.. ఎమోషనల్ ట్వీట్ చేసిన కమల్ హాసన్..

ప్రముఖ తమిళ సినీ నిర్మాత కె మురళీధరన్ గుండెపోటుతో గురువారం రాత్రి తమిళనాడులోని తన స్వస్థలమైన కుంభకోణంలో కన్నుమూశారు. ఈయన గతంలో తమిళ నిర్మాతల మండలికి అధ్యక్షుడిగా కూడా పనిచేసారు. లక్ష్మీ మూవీ మేకర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి.................

K Muralidharan : ప్రముఖ సినీ నిర్మాత మృతి.. ఎమోషనల్ ట్వీట్ చేసిన కమల్ హాసన్..

K Muralidharan :  ప్రముఖ తమిళ సినీ నిర్మాత కె మురళీధరన్ గుండెపోటుతో గురువారం రాత్రి తమిళనాడులోని తన స్వస్థలమైన కుంభకోణంలో కన్నుమూశారు. ఈయన గతంలో తమిళ నిర్మాతల మండలికి అధ్యక్షుడిగా కూడా పనిచేసారు. లక్ష్మీ మూవీ మేకర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి తమిళ్ లో విజయ్, సూర్య, శింబు, కమల్ హాసన్, ధనుష్, జయం రవి లాంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు.

కమల్ హాసన్ తో అంబే శివమ్ సినిమాని తెరకెక్కించారు. నటుడిగా కూడా పలు తమిళ సినిమాల్లో నటించారు. గత కొన్నేళ్లుగా సినిమాలకి దూరంగా ఉంటున్నారు. గురువారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు. తమిళ సినీ ప్రముఖులు, తమిళ నిర్మాతల మండలి ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు.

Manchu vishnu : జూబ్లీహిల్స్ ట్రాఫిక్ డైవర్షన్ పై మంచు విష్ణు ట్వీట్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు..

ఈ మేరకు కమల్ హాసన్ కూడా నిర్మాత కె మురళీధరన్ తలుచుకుంటూ తమిళ్ లో.. అనేక హిట్ సినిమాలు నిర్మించిన లక్ష్మి మూవీ మేకర్స్ అధినేత నిర్మాత కె మురళీధరన్ ఇక లేరు, ప్రియమైన శివా.. నీతో కలిసి పనిచేసిన రోజులు నాకింకా గుర్తున్నాయి. అతనికి నా నివాళి అని పోస్ట్ చేశారు.