Posani : ఎట్టకేలకు బయటకి వచ్చిన పోసాని

న్ని రోజులు కనపడని పోసాని ఇవాళ ఉదయం 'మా' ఎలక్షన్స్ లో ఓటు వేయడానికి వచ్చి మీడియాకి చిక్కారు. పోలింగ్ ప్రారంభమైన మొదటి అరగంటలోనే పోసాని పోలింగ్ కేంద్రం వద్దకి వచ్చారు.

10TV Telugu News

Posani :  పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ తర్వాత పోసాని ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కళ్యాణ్ ని విమర్శించారు. దీంతో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పోసానిని టార్గెట్ చేయడంతో పోసాని మరోసారి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ని, ఆయన అభిమానులని తీవ్రంగా విమర్శించారు. వ్యక్తిగత దూషణలు చేశారు. దీంతో ప్రెస్ మీట్ బయటే ఆయన పై దాడికి ప్రయత్నించారు పవన్ అభిమానులు. పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి నాకు ప్రాణ హాని ఉంది అని మీడియాకి తెలిపారు పోసాని. ఇదే విషయంపై పోలీసులకి కూడా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కొంతమంది పోసాని ఇంటిపై దాడి చేశారు. చేసింది పవన్ అభిమానులే అని పోలీసులకి ఫిర్యాదు చేసాడు పోసాని. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు పోసాని కనపడలేదు. పవన్ కళ్యాణ్ అభిమానులకి భయపడి అజ్ఞాతంలోకి వెళ్లారని అన్నారు. షూటింగ్స్ కి కూడా రావట్లేదు అని నిర్మాతలు కూడా తెలిపారు. ఇన్ని రోజులు ఎవరికీ కనపడని పోసాని సడెన్ గా ఇవాళ ‘మా’ ఎలక్షన్స్ లో కనపడ్డారు.

MAA Elections 2021 : ‘మా’ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

ఇవాళ ఉదయం నుంచి జూబ్లీ పబ్లిక్ స్కూల్ లో ‘మా’ ఎలక్షన్స్ పోలింగ్ జరుగుతుంది. తెలుగు సినీ ఆర్టిస్టులంతా తరలి వచ్చి ఓటు వేస్తున్నారు. 8 గంటలకే ఈ పోలింగ్ మొదలైంది. ఐతే ఇన్ని రోజులు కనపడని పోసాని ఇవాళ ఉదయం ‘మా’ ఎలక్షన్స్ లో ఓటు వేయడానికి వచ్చి మీడియాకి చిక్కారు. పోలింగ్ ప్రారంభమైన మొదటి అరగంటలోనే పోసాని పోలింగ్ కేంద్రం వద్దకి వచ్చారు. తన ఓటు వేసి ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా ఎక్కువ సేపు ఉండకుండా వెళ్లిపోయారు. మీడియా మాట్లాడమని అడిగినా కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఇంత రచ్చ చేసి ఎవరికీ కనపడకుండా పోయి ఇప్పుడు ఇలా సైలెంట్ గా బయటకి వచ్చి మళ్ళీ వెళ్లిపోయారు. రేపట్నుంచి పోసాని మళ్ళీ కనపడతాడా? షూటింగ్స్ కి వస్తారా ? లేదా మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

×