Posani Krishna Murali: ఆచూకీ లేని పోసాని.. వేటు తప్పదా?

సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగు సినిమా ప్రేక్షకులకు ఇంకా గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా వేడుక నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన..

Posani Krishna Murali: ఆచూకీ లేని పోసాని.. వేటు తప్పదా?

Posani Krishna Murali

Posani Krishna Murali: సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగు సినిమా ప్రేక్షకులకు ఇంకా గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా వేడుక నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ రచ్చ లేపగా.. ఇటు సినీ పరిశ్రమలో కూడా హీట్ పెంచేసింది. రాజకీయంగా ఏపీలో అధికార పార్టీ వైసీపీ నుండి జనసేన పార్టీ నేతలతో పాటు పవన్ కళ్యాణ్ పై మాటల ఎదురు దాడి జరిగితే.. ఇండస్ట్రీలో కొందరు పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపారు.

Telugu Actors: మొన్న తేజ్.. ఇప్పుడు రామ్.. ఎందుకిలా జరుగుతోంది?

అయితే, నటుడు పోసాని కృష్ణ మురళీ మాత్రం పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఒకవిధంగా రాజకీయాలను మించి పవన్ పర్సనల్ విషయాలతో పాటు పవన్ అభిమానులు నొచ్చుకొనేలా దూషణ కూడా కనిపించింది. అందుకు తగ్గట్లే ప్రెస్ మీట్ పెట్టేందుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు వెళ్లిన పోసానిపై పవన్ అభిమానులు దాడి వరకు వెళ్ళింది. దీంతో పోసాని తనకు ప్రాణహాని ఉందని స్టేట్మెంట్లు కూడా ఇచ్చేశాడు.

Samantha: టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేయనున్న సామ్?

ఏమైందో ఏమో కానీ ఆ తర్వాత పోసాని ఎక్కడా కనిపించలేదు. పోసాని బిజీ నటుడన్న సంగతి తెలిసిందే. తనదైన మేనరిజంతో ఇటు ఎమోషన్.. అటు సీరియస్ పలికించగల నటుడిగా పోసానికి మంచి గుర్తింపు ఉండగా అందుకే ఆయనకి ఆఫర్లు కూడా భారీగానే ఉంటాయి. కానీ ఇప్పుడు ఆయన ఒప్పుకున్న సినిమాల షూటింగ్ కి కూడా వెళ్లడం లేదు. దీంతో ఇప్పుడు ఆయన నటించే సినిమాలు షూటింగ్ కి ఇబ్బందిగా మారినట్లు తెలుస్తుంది.

Telugu New Films: కెమెరా.. యాక్షన్.. కొత్త సినిమా స్టార్ట్!

ఒకవైపు పవన్ కళ్యాణ్ లాంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడిపై తనకి సంబంధం లేకపోయినా రాజకీయ కారణాలతో మాటల దాడికి దిగడం.. ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలకు కూడా మొహం చాటేయడంతో నిర్మాతల మండలి ఆయనపై గుర్రుగా ఉంది. తమ్మారెడ్డి భరద్వాజ లాంటి నిర్మాతలు బహిరంగంగానే పోసానికి అవసరం లేకపోయినా వేలుపెట్టి తప్పు చేశాడని వెల్లడించారు. కాగా, ఇప్పుడు నిర్మాతల మండలి పోసానిపై వేటు వేయడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లుగా కనిపిస్తుంది. మరి పోసాని ఈ సమస్యను పరిష్కరించుకుంటారా? లేక నిర్మాతల నుండి వేటు తప్పదా అన్ని కొద్దిరోజులలోనే తేలనుంది.