చంద్రబాబుని చెడుగుడు ఆడిన పోసాని

  • Published By: vamsi ,Published On : March 18, 2019 / 07:36 AM IST
చంద్రబాబుని చెడుగుడు ఆడిన పోసాని

ప్రముఖ సినీనటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎంకి ఒక నీతి, లోకేశ్‌కి ఒక నీతి, పోసానికి ఒక నీతి ఉంటుందా? అంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో తాను కూడా పౌరుడినేనని.. సామాన్యుడినని.. తనకు నోటీసులు పంపిస్తారా? అంటూ మండిపడ్డారు.
Read Also : పొలిటికల్ జట్కాబండి : ఇండిపెండెంట్ గా సుమలత పోటీ

‘ముఖ్యమంత్రి గారు.. మీరు మాట ఇచ్చారు’ అనే సినిమాను ఆపాలంటూ.. ఎన్నికల సంఘం నుంచి లేఖ రావడంపై పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏ కులం, ఏ మతం వాళ్లు కూడా చంద్రబాబుకు ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. చంద్రబాబు దొంగ అని, ఆబద్ధాలకోరు అని, అవినీతిపరుడు అని, విలువల్లేని వ్యక్త అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటేస్తే.. కమ్మ రాజ్యానికి ఓటేసినట్లేనని పోసాని మండిపడ్డారు. చంద్రబాబుకు ఓటేసి గెలిపిస్తే ఏపీ కమ్మ రాష్ట్రం అయిపోతుందని ధ్వజమెత్తారు. ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు ఆ పార్టీకి ఓటేస్తే కాపులకు ఓటేసినట్లేనని టీడీపీ ప్రచారం చేసిందంటూ పోసాని గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్ కారణంగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు పవన్‌నే తిట్టిస్తున్నాడని మండిపడ్డారు. వైసీపీ మద్ధతుదారుని కాబట్టే తనను వేధిస్తున్నారని అన్నారు. ఎవరో మోహన్‌రావు అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తే తన సినిమాను ఈసీ నిలిపివేయడం ఏమిటంటూ ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్ మార్కండేయులు తనకు నోటీసులు పంపారని, నోటీసులకు మూడు పేజీల వివరణ ఇచ్చానంటూ వెల్లడించారు.
Read Also : ఎవరీ కొమ్మా పరమేశ్వర్ రెడ్డి : వివేక హత్య తరువాత మాయం