Postpone Movies: ఇదిగో అదిగో అంటున్నా.. ధియేటర్లోకి రాని సినిమాలు!

అంతా అయిపోయింది.. ఇంకేముంది రిలీజే అనుకున్నారు. కానీ ఎన్నాళ్లైనా సినిమా మాత్రం ధియేటర్లోకి రావడం లేదు. ఇదిగో అదిగో అంటున్నారే కానీ బొమ్మ మాత్రం పడడటం లేదు. కరోనా వల్ల కొన్ని సినిమాలు, పెద్ద సినిమాలతో పెట్టుకోవడం ఎందుకని ఇంకొన్ని సినిమాలు..

Postpone Movies: ఇదిగో అదిగో అంటున్నా.. ధియేటర్లోకి రాని సినిమాలు!

Postpone Movies

Postpone Movies: అంతా అయిపోయింది.. ఇంకేముంది రిలీజే అనుకున్నారు. కానీ ఎన్నాళ్లైనా సినిమా మాత్రం ధియేటర్లోకి రావడం లేదు. ఇదిగో అదిగో అంటున్నారే కానీ బొమ్మ మాత్రం పడడటం లేదు. కరోనా వల్ల కొన్ని సినిమాలు, పెద్ద సినిమాలతో పెట్టుకోవడం ఎందుకని ఇంకొన్ని సినిమాలు, మంచి సీజన్ లేక మరికొన్ని సినిమాలు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ.. చేసుకుంటూ వస్తున్నాయి.

Postponed Movies: అటకెక్కిన సినిమాలు.. సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం!

రిలీజ్ లు పోస్ట్ పోన్ అవ్వడం కొత్తవిషయం ఏం కాదు. కానీ ఒక సారి, రెడు సార్లు కాదు.. ఇదిగో సినిమా.. అదిగో రలీజ్ అంటూ 4,5 సార్లకు మించి పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి కొన్ని సినిమాలు. వాటిలో మహేష్ బాబు సినిమా ఒకటి. మహేష్ బాబు ప్రొడక్షన్లో తెరకెక్కతున్న మేజర్ మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యింది. అడివి శేష్ లీడ్ రోల్ లో ముంబై పేలుళ్లలో చనిపోయిన మేజర్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరీ ఆధారంగా తరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ మేజర్.. జులై 2, 2021న రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఆ తర్వాత ఈ సంవత్సరం ఫిబ్రవరి 11న రిలీజ్ అనౌన్స్ చేసింది. అయితే అది కూడా మిస్ అయ్యి మే 27న ఈ సారి రిలీజ్ పక్కా అన్నారు. కానీ ఇప్పుడు మేలో కూడా రిలీజ్ పోస్ట్ పోన్ చేసి జూన్ 3న తెలుగు, తమిళ్, హిందీలో సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.

Postpone Movies: క్రేజీ కాంబినేషన్స్.. కానీ సెట్స్ మీదకెళ్ళడం చాలా లేట్!

వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఎఫ్ 3 సినిమా కూడా మల్టిపుల్ టైమ్స్ పోస్ట్ పోన్ అయ్యింది. ఎట్టి పరిస్తితుల్లో ఈ సంవత్సరం సంక్రాంతి బరిలోకి దిగుతామని ఫుల్ కాన్ఫిడెంట్ గా చెప్పిన ఎఫ్ 3.. అప్పటికే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన ట్రిపుల్ఆర్, రాధేశ్యామ్ లాంటి పెద్ద సినిమాలతో లేనిపోని రిస్క్ ఎందుకుని తప్పుకుంది. జనవరి నుంచి ఫిబ్రవరి 25కు షిఫ్ట్ అయిన ఎఫ్ 3 భీమ్లానాయక్ అడ్డురావడంతో మరోసారి డేట్ రీషెడ్యూల్ చేసుకుంది. ఫిబ్రవరి 25 నుంచి ఈ సారి ఏప్రిల్ 29 కి పోస్ట్ పోన్ అయ్యింది. ఈ డేట్ కి ఆల్రెడీ ఆచార్య లైన్లో ఉండడంతో ఈ సారి కూడా పోస్ట్ పోన్ అయ్యి మే 27కి రిలీజ్ ఫిక్స్ చేసుకుందిఎఫ్ 3.

Shooting Postpones: ఆగిన సినిమాలు.. సెట్స్ మీదకెప్పుడు? షూటింగ్ ఎప్పుడు?

నాని అప్ కమింగ్ మూవీ అంటే సుందరానికి కూడా చాలా సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంది. అసలు లాస్ట్ ఇయర్ లోనే రిలీజ్ అవ్వాల్సింది. కానీ కోవిడ్ తో పోస్ట్ పోన్ చేసుకుంది. ఈ ఎర్లీ సమ్మర్ లో రిలీజ్ చేద్దామనుకున్నా.. పెద్ద సినిమాలన్నీ రిలీజ్ కు ఉండడంతో రిస్క్ ఎందుకని, ఏప్రిల్, మే, జూన్ ఇలా వరసగా రిలీజ్ డేట్స్అనౌన్స్ చేసింది. ఆఖరికి అన్నీ పోస్ట్ పోన్ చేసుకుంటూ జూన్ 10న ధియేటర్లోకి వస్తున్నమని డేట్ ఫిక్స్ చేసుకుంది.

Release Postpone: సర్వం సిద్ధం.. కానీ.. తప్పని రిలీజ్ డేట్స్ రీ షెడ్యూల్

మాస్ మహారాజా రవితేజ కూడా రామారావ్ ఆన్ డ్యూటీ సినిమాని ఇలాగే చాలా సార్లు పోస్ట్ పోన్ చేసుకున్నారు. శరత్ మండవ డైరెక్షన్లో పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్న రవితేజ.. మార్చి 25న సనిమా రిలీజ్ అవుతున్నట్టు లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో అనౌన్స్ చేశారు. కానీ ట్రిపుల్ ఆర్ రిలీజ్ అనౌన్స్ చెయ్యడంతో దెబ్బకి జూన్ 17కి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నారు రవితేజ. యంగ్ హీరో విష్వక్ సేన్ కూడా అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాని మూడు సార్లు పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 22న రిలీజ్ అనౌన్స్ చేసినా.. అది కాస్తా ఏప్రిల్ 30కి మారి ఆఖరికి మే 6కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.