Bhavadeeyudu Bhagat Singh: ప్రొఫెసర్‌గా మారనున్న పవర్ స్టార్.. కెరీర్‌లో ఇదే ఫస్ట్ టైమ్!

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పవర్ స్టార్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. క్రిష్ హరిహర వీరమల్లు షూటింగ్ శరవేగంగా కానిచ్చేస్తున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమా చేస్తారా.. లేక సముద్రఖని తో రీమేక్ చేస్తారా అనే డౌట్ ఫ్యాన్స్ లో క్రియేట్ అయ్యింది.

Bhavadeeyudu Bhagat Singh: ప్రొఫెసర్‌గా మారనున్న పవర్ స్టార్.. కెరీర్‌లో ఇదే ఫస్ట్ టైమ్!

Bhavadeeyudu Bhagat Singh

Bhavadeeyudu Bhagat Singh: బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పవర్ స్టార్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. క్రిష్ హరిహర వీరమల్లు షూటింగ్ శరవేగంగా కానిచ్చేస్తున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమా చేస్తారా.. లేక సముద్రఖని తో రీమేక్ చేస్తారా అనే డౌట్ ఫ్యాన్స్ లో క్రియేట్ అయ్యింది. ఇదిగో అదిగో అంటూ హరీశ్ శంకర్ ను ఊరిస్తున్న పవర్ స్టార్ ఏ సినిమాకు ఫస్ట్ ప్రిఫరెన్సిస్తున్నారు? గబ్బర్ సింగ్ తో పవర్ ఫుల్ పోలీస్ గా పవన్ ను ఎలివేట్ చేసిన హరీశ్ శంకర్ లేటెస్ట్ సినిమాలో ఏ క్యారెక్టర్ తో అలరించబోతున్నారు? అనే చర్చ ఫ్యాన్స్ మధ్య హాట్ హాట్ గా నడుస్తోంది.

Pawan Kalyan: ఆ డైరెక్టర్‌ను పవన్ పక్కనబెట్టాడా?

భీమ్లానాయక్ గా ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ తీసుకొచ్చిన పవన్.. ఈమధ్య లాయర్ గా, పోలీస్ గా, బంధిపోటుగా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ లతో సినిమాలు చేసి, ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నారు. అయితే గత కొంత కాలంగా సెట్స్ పైకెళ్లడానికి రైట్ టైమ్ కోసం వెయిట్ చేస్తున్నారు హరీశ్ శంకర్. భవదీయుడు భగత్ సింగ్ లో పవన్ ను మరో కొత్త క్యారెక్ట ర్ లో చూపించాలనుకుంటున్నారు. కాని, ఈ సినిమా సెట్స్ మీదకెప్పుడెళ్తుంది? ఈ సినిమాలో పవర్ స్టార్ ఎలాంటి క్యారెక్టర్ చేయబోతున్నారన్న ఆసక్తి మాత్రం ఫ్యాన్స్ లో క్రియేట్ అయింది.

Harish Shnkar: పవన్-త్రివిక్రమ్‌ల బంధం.. అలకబూనిన హరీష్?

గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ పట్టాలెక్కించడం కోసం కల్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.. గద్దల కొండ గణేశ్ తర్వాత మరో సినిమా చేయలేదు. పవన్ కళ్యాణ్ తోనే సినిమా చేయాలని కంకణం కట్టుకుని, ఆయన డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు హరీశ్.. భవదీయుడు భగత్ సింగ్ సినిమాను భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయడానికి రెడీ గా ఉన్నారు.. కావాల్సింది పవన్ కళ్యాణ్ సిగ్నలే.

Pawan Kalyan: పవన్ కెరీర్‌లో పది రీమేక్ సినిమాలు.. ఈసారి ఫలితమేంటో?

ప్రస్తుతం వేగంగా హరిహర వీరమల్లు షూటింగ్ కానిచ్చేస్తున్న పవన్ కళ్యాణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ పైన ఫ్యాన్స్ లో కన్ఫ్యూజ్ క్రియేట్ అయ్యింది. మలయాళీ హిట్ అయప్పనుమ్ కోషియుమ్ రీమేక్ గా వచ్చి బంపర్ హిట్ అనిపించుకుంది భీమ్లానాయక్. ఈ సక్సెస్ లో మేజర్ పార్ట్ త్రివిక్రమ్ దే. అందుకే పవన్ కూడా మరో హిట్ కోసం సముద్రఖని డైరెక్షన్ లో త్రివిక్రమ్ వినోదయ సిత్తం రీమేక్ ను ప్లాన్ చేస్తున్నారని ఊహించుకున్నారు. దాంతో భవదీయుడు భగత్ సింగ్ సినిమా మరింత ఆలస్యంగా సెట్స్ పైకెళ్తుంది అనుకున్నారు ఫ్యాన్స్.. కాని, వినోదయా సిత్తం రీమేక్ కన్నా ముందే హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ ఉంటుందని తెలుస్తోంది.

Pawan Kalyan: అవును.. పవన్ అలాగే కనిపిస్తాడట!

లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రీ కొడుకులుగా డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని, ఒకరు ప్రొఫెసర్ గా, మరొకరు భగత్ సింగ్ భావజాలాన్ని ఇష్టపడే వ్యక్తిగా కనిపిస్తారని టీమ్ నుంచి వస్తున్న సమాచారం. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లును వీలైనంత త్వరగా పూర్తి చేయాలనేది పవన్ ఫస్ట్ ప్రియారిటీ. ఆపై లైన్ లో హరీశ్ శంకర్ భవదీయుడు.. భగత్ సింగ్ ప్రాజెక్ట్ ను జులై లేదా ఆగస్గు నుంచి పట్టాలెక్కించి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు అఫిషియల్ అనౌన్స్ మెంట్ తో రివీల్ కానున్నాయి.