పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్. ‘వకీల్ సాబ్’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 26వ సినిమా ‘వకీల్ సాబ్’ ఫస్ట్ లుక్..

  • Published By: sekhar ,Published On : March 3, 2020 / 12:47 PM IST
పవర్ స్టార్  ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్. ‘వకీల్ సాబ్’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 26వ సినిమా ‘వకీల్ సాబ్’ ఫస్ట్ లుక్..

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తోన్న రోజు రానే వచ్చింది. తమ అభిమాన కథానాయకుడు వెండితెరపై కనిపిస్తే చూడాలని ఆశపడిన వాళ్లకు ఫస్ట్‌గిఫ్ట్‌ అందింది. ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ టైటిల్ పాత్రలో వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. సోమవారం ఈ చిత్రానికి సంబంధించి పవన్‌ ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను ప్రకటించారు. ఈ సినిమాకు ‘వకీల్‌ సాబ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

చేతిలో పుస్తకం, కళ్లజోడు పెట్టుకుని పడుకుని ఉన్న పవన్‌ లుక్‌ అభిమానులను విశేషంగా అలరిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ పతాకంపై బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌తో కలిసి దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. హిందీలో ఘన విజయం సాధించిన ‘పింక్‌’ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

వేసవి కానుకగా మే 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత‌లు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు, సంగీత ద‌ర్శ‌కుడు థమ‌న్ స‌మ‌క్షంలో దిల్‌రాజు కార్యాల‌యం ఎదుట ప‌వ‌న్ అభిమానులు కేక్ క‌ట్ చేసి సంబ‌రాలు చేసుకున్నారు.

Power Star Pawan Kalyan as Vakeel Saab

PSPK 26