Prabhas : రాజమౌళి వల్ల డైరెక్టర్స్ అందరూ నన్ను తిడతారు.. విశ్వనాథ్ గారు కూడా తిట్టారు..

ఛత్రపతి సినిమాలో ఇంటర్వెల్ సీన్ చాలా పవర్ఫుల్. ఆ సీన్ లో చుట్టూ జనల మధ్య ప్రభాస్ డైలాగ్ భారీగా చెప్తాడు. ఈ సన్నివేశం గురించి ప్రభాస్ చెప్తూ..............

Prabhas : రాజమౌళి వల్ల డైరెక్టర్స్ అందరూ నన్ను తిడతారు.. విశ్వనాథ్ గారు కూడా తిట్టారు..

Prabhas about chatrapathi movie and rajamouli

Prabhas :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆరు ఎపిసోడ్స్ ఇప్పటికే పూర్తికాగా ఏడో ఎపిసోడ్ లో ప్రభాస్ ని తీసుకొచ్చారు. ప్రభాస్ ఈ షోకి వస్తున్నాడు అని తెలియడంతో ముందునుంచి ఈ ఎపిసోడ్ పై అంచనాలు బాగా పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అయితే ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి ఫ్యాన్స్ కి మరింత జోష్ ఇచ్చింది ఆహా టీం.

ప్రభాస్ అన్‌స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ డిసెంబర్ 30న స్ట్రీమ్ అవుతుందని చెప్పినా డిసెంబర్ 29 రాత్రే రిలీజ్ చేసి అభిమానులకి ముందుగానే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని ఇచ్చింది ఆహా. ఎపిసోడ్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాలకే ఆహా సర్వర్లు ఎక్కువ ఫ్లోటింగ్ తో క్రాష్ అయ్యాయి అంటే ఈ ఎపిసోడ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

ఇక ఎపిసోడ్ లో ప్రభాస్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు బాలయ్య. ప్రభాస్ నటుడిగా మారి 20 సంవత్సరాలు అవుతుండటంతో అభిమానులతో స్పెషల్ షూట్ చేసి ప్రోమో కూడా వేశారు. ప్రభాస్ సినిమాలు, పెళ్లి.. ఇలా అనేక టాపిక్స్ ప్రస్తావించాడు బాలయ్య. అలాగే కొన్ని డైలాగ్స్ కూడా వినిపించి అది ప్రభాస్ సినిమాల్లో ఏదో చెప్పమన్నాడు బాలయ్య. ప్రభాస్ అన్నిటికి కరెక్ట్ గా చెప్పేశాడు. అయితే ఛత్రపతి సినిమా డైలాగ్ వచ్చినప్పుడు ఓ ఆసక్తికర విషయాన్ని తెలియచేశాడు ప్రభాస్.

ఛత్రపతి సినిమాలో ఇంటర్వెల్ సీన్ చాలా పవర్ఫుల్. ఆ సీన్ లో చుట్టూ జనల మధ్య ప్రభాస్ డైలాగ్ భారీగా చెప్తాడు. ఈ సన్నివేశం గురించి ప్రభాస్ చెప్తూ.. ఛత్రపతి ఇంటర్వెల్ లో చుట్టూ జనం ఉన్నారు. నా మొహమాటం తెలిసిందే కదా. అందులోను వర్షం, చలి ఉన్నాయి. దీంతో ఆ డైలాగ్స్ సైలెంట్ గా చెప్తాను, జస్ట్ లిప్స్ కదిలినట్టు ఉంటాయి. డబ్బింగ్ లో మేనేజ్ చేద్దాం అని అన్నాను. దీనికి రాజమౌళి కూడా ఓకే అన్నారు. రెండు సార్లు ఆ సీన్ ని షూట్ చేశారు. అక్కడున్న జనాలంతా రిహార్సల్స్ చేస్తున్నాడేమో అనుకున్నారు, అంతలో రాజమౌళి టెక్ ఓకే అని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు.

Prabhas : హీరోయిన్స్ అంతా బాలయ్యనే పొగుడుతారు..

అప్పట్నుంచి జనాలు ఎక్కువగా ఉంటే డైలాగ్స్ సైలెంట్ గా చెప్పి, డబ్బింగ్ లో చెప్తున్నాను. ఇది తెలిసి మిగిలిన డైరెక్టర్స్ రాజమౌళి వల్లే ఇలా అయ్యాను అంటూ తిడుతూ ఉంటారు. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో విశ్వనాధ్ గారు ఉన్నప్పుడు కూడా ఇలాగే చెప్పాను. దాంతో ఆయన పిలిచి ఇలా అయితే ఎలా అని తిట్టారు, భవిష్యత్తులో ప్రాబ్లమ్ వస్తుంది, డైలాగ్స్ బయటకి చెప్పడం అలవాటు చేసుకో అన్నారు అని తెలిపాడు ప్రభాస్.