Prabhas : ఏమీ లేకపోయినా సోషల్ మీడియాలో నా మీద అనవసరంగా రాస్తున్నారు.. ప్రభాస్!

ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్-1ని ఫ్యాన్స్ కోసం ఒక రోజు ముందుగానే విడుదల చేశారు షో నిర్వాహకులు. ఇక ఈ ఎపిసోడ్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ గా సాగింది. బాలకృష్ణ అయితే ప్రభాస్‌ని పెళ్లి, ప్రేమ విషయాలు గురించి అడిగి ఒక ఆట ఆడుకున్నాడు. ఈ క్రమంలోనే...

Prabhas : ఏమీ లేకపోయినా సోషల్ మీడియాలో నా మీద అనవసరంగా రాస్తున్నారు.. ప్రభాస్!

prabhas about love rumours with kriti sanon

Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్-1ని ఫ్యాన్స్ కోసం ఒక రోజు ముందుగానే విడుదల చేశారు షో నిర్వాహకులు. నిన్న రాత్రి 9 గంటలకు మోస్ట్ యాంటిసిపేటెడ్ ఎపిసోడ్ ని విడుదల చేయగా.. అనుకోని రీతిలో స్ట్రీమింగ్ ట్రాఫిక్ రావడంతో, ఆహా వెబ్‌సైట్ క్రాష్ అయ్యింది. అయితే కొంత సమయానికే దానిని పరిష్కరించి ఎపిసోడ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.

Prabhas – Charan : బ్రో కోడ్ బ్రేక్ చేసి ప్రభాస్‌ని ఆడుకున్న చరణ్.. సనన్ లేదా శెట్టి?

ఇక ఈ ఎపిసోడ్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ గా సాగింది. బాలకృష్ణ అయితే ప్రభాస్‌ని పెళ్లి, ప్రేమ విషయాలు గురించి అడిగి ఒక ఆట ఆడుకున్నాడు. ఈ క్రమంలోనే పెళ్లి గురించి అడగా.. ‘రాసి పెట్టి లేదు సార్, లేదంటే ఈ పాటికి అయ్యిపోయేది’ అని బదులిచ్చాడు. దానికి బాలయ్య.. ‘మీ అమ్మకి చెప్పిన మాటలు నాకు చెప్పకయ్యా’ అంటూ కౌంటర్ ఇచ్చాడు.

ఆ తరువాత బాలయ్య.. ‘కృతి‌సనన్‌తో ఉన్న రిలేషన్‌షిప్ ఏంటో చెప్పకుంటే నేను షో అర్ధంతరంగా ఆపేస్తా’ అంటూ గట్టిగా ప్రశ్నించాడు. దీంతో చేసేది లేక ప్రభాస్.. ‘అదేమి లేదు సార్, అది అయినా పాత న్యూస్. ఏమి లేదని వచ్చేసిందిగా వార్త’ అని బదులిచ్చాడు. దానికి బాలయ్య.. ఏమీ లేదని వాళ్ళు చెప్పారు, మనం చెప్పలేదు కదా?

మేడం చెప్పారు కదా సార్ అని ప్రభాస్ అంటే, అలా చెప్పించారా అని బాలయ్య కౌంటర్ ఇచ్చాడు. మేడమే చెప్పింది సార్ అని ప్రభాస్ అంటే.. అయినా మేడం ఏంటి, అంత రొమాన్స్ ఉందా? మీ మధ్య అని బాలయ్య క్యూస్షన్ చేశాడు. మేడంలో రొమాన్స్ ఏముంది సార్ అని ప్రభాస్ అడగా.. ‘నేను నా భార్యని వసు మేడం వసు మేడం అనే పిలుస్తాను’ అంటూ బాలయ్య బదులిచ్చాడు.

నువ్వేమో నవ్వుతూ నో అంటున్నావు, ఆమె ఏమో సీరియస్ గా నో అంటుంది. బయట ఇంటర్నెట్ లో మాత్రం మీ మధ్య ఏదో ఉంది అంటుంది. ఏంటి సంగతి అని బాలయ్య అడగా.. ‘మీ టైంలో ఇంటర్నెట్ లేదు, మీకు ఏ ఇబ్బందులు లేవు. మాకు ఏమీ లేకపోయినా సోషల్ మీడియాలో అనవసరంగా రాస్తున్నారు’ అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. దీంతో ప్రభాస్-సనన్ మధ్య ఏమీ లేదని ప్రభాస్ కూడా తేల్చేసాడు.