Adipurush: ఎట్టకేలకు ఆదిపురుష్ నుండి అప్డేట్ వచ్చేసింది.. శ్రీరామనవమి గిఫ్ట్ అదిరింది!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది మోస్ట్ వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ నుండి ఎట్టకేలకు ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్. శ్రీరామనవమి పర్వదిన్నాని పురస్కరించుకుని, ఈ సినిమా నుండి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఓ సరికొత్త పోస్టర్‌తో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

Adipurush: ఎట్టకేలకు ఆదిపురుష్ నుండి అప్డేట్ వచ్చేసింది.. శ్రీరామనవమి గిఫ్ట్ అదిరింది!

Prabhas Adipurush Movie Gives A Big Update On Sri Rama Navami

Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది మోస్ట్ వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ నుండి ఎట్టకేలకు ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్. ఈ సినిమా షూటింగ్ గతంలోనే పూర్తయినా, కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తూ వచ్చింది చిత్ర యూనిట్. దర్శకుడు ఓం రావుత్ తెరకెక్కిస్తున్న ఈ ప్రెస్టీజియస్ మైథాలిజికల్ మూవీని రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.

Adipurush : ఆదిపురుష్ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు ఓం రౌత్..

అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో కళ్లుచెదిరే గ్రాఫిక్స్ ఉండనున్నాయి. ఈ సినిమా టీజర్ గతంలోనే రిలీజ్ కాగా, దానికి మిక్సిడ్ రెస్పాన్స్ దక్కింది. వీఎఫ్ఎక్స్ పనులను మరింత క్వాలిటీగా చేసేందుకు చిత్ర యూనిట్ మరికొంత సమయాన్ని తీసుకుంది. అయితే, ఈ సినిమా నుండి ఇటీవల ఎలాంటి అప్డేట్ రావడం లేదని సర్వత్రా చర్చలు సాగుతున్న తరుణంలో, శ్రీరామనవమి పర్వదిన్నాని పురస్కరించుకుని, ఈ సినిమా నుండి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఓ సరికొత్త పోస్టర్‌తో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

Adipurush : ఓం రౌత్ ని ఆడేసుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్.. శ్రీరామనవమికి అయినా ఆదిపురుష్ అప్డేట్ ఇస్తారా?

సీతా సమేత శ్రీరాముడిగా ప్రభాస్ లుక్ అదిరిపోయింది. మనకు ప్రతి ఇంట్లో కనిపించే శ్రీరాముడి ఫోటోకు ప్రతిరూపంగా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. సీతా, లక్ష్మణ సమేత శ్రీరాముడికి హనుమాన్ దండం పెడుతున్న పోస్టర్‌ను ఆదిపురుష్ మూవీ టీమ్ రిలీజ్ చేసింది. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ్‌దత్తా నాగే ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ మరోసారి ఆదిపురుష్ సినిమాపై అంచనాలను పెంచేసింది. టీ-సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోన్న ఆదిపురుష్ చిత్రాన్ని జూన్ 16న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.