Adipurush : బాహుబలి సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్న ఆదిపురుష్.. తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ఎప్పుడో తెలుసా?

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ అండ్ ప్లేస్ ని ఫిక్స్ చేశారు మేకర్స్. ఇక ఆ ప్లేస్ తో బాహుబలి సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Adipurush : బాహుబలి సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్న ఆదిపురుష్.. తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ఎప్పుడో తెలుసా?

Prabhas Adipurush Pre Release Event held at tirupathi

Adipurush Pre Release Event : ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ఆదిపురుష్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు. ఇక చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రమోషన్స్ పనులు మొదలు పెట్టేసింది. ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ అండ్ సాంగ్స్ సినిమా పై అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు మేకర్స్.

Prabhas : ఆదిపురుష్ హిట్ అవ్వాలని.. భద్రాద్రి రాముడికి 10 లక్షల విరాళం ఇచ్చిన ప్రభాస్..

జూన్ 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతిలో నిర్వహించబోతున్నారు. అయితే గతంలో ప్రభాస్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా తిరుపతిలోనే నిర్వహించారు. ఇక ఇప్పుడు ఈ ఈవెంట్ ని అదే ప్లేస్ లో ఏర్పాటు చేస్తుండడంతో బాహుబలి సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందేమో అని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆదిపురుష్, బాహుబలిలా ప్రేక్షకులను అలరించి ఆ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.

Prabhas: ప్రభాస్ కోసం మారుతి అవి బాగా యాడ్ చేస్తున్నాడట..!

కాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు అన్న విషయం పై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జూన్ 16న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. బాలీవుడ్ బడా నిర్మాణసంస్థ టి సిరీస్, రెట్రోఫైల్స్ సంస్థతో కలిసి ఈ సినిమాని 600 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక యూఎస్ కి సంబంధించిన ఈ మూవీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇప్పటికే అధిక స్థాయిలో టికెట్స్ కూడా అమ్ముడు పోయినట్లు సమాచారం.