Release Clash : ప్రభాస్‏తో అక్షయ్ కుమార్ పోటీ..

ప్రభాస్‌తో పోటీ పడుతున్న అక్షయ్ కుమార్.. దీపావళికి నువ్వో నేనో తేల్చుకుందామంటున్న రజినీ కాంత్ - రణ్‌వీర్ సింగ్..

Release Clash : ప్రభాస్‏తో అక్షయ్ కుమార్ పోటీ..

Prabhas Akshay Kumar

Release Clash: ప్రభాస్‌తో పోటీ పడుతున్న అక్షయ్ కుమార్, దీపావళికి నువ్వో నేనో తేల్చుకుందామంటున్న రజనీ కాంత్ – రణ్‌వీర్ సింగ్, నాతో పోటీకి రెడీయేనా అంటూ టైగర్ ష్రాఫ్‌ని రెచ్చగొడుతున్న అజయ్ దేవ్‌గణ్.. ‘బ్యాట్ మ్యాన్’ తో పోటీ పడుతున్న ‘బచ్చన్ పాండే’.. ఇలా బాలీవుడ్‌లో రెడీ అవుతున్న బిగ్గెస్ట్ రిలీజ్ క్లాష్‌లో గెలిచేదెవరో డీటెయిల్డ్‌గా చూద్దాం.

Love Story : అందుకే వైష్ణవ్ తేజ్ వద్దన్నాడా..?

నిన్నటి వరకూ థియేటర్లు లేక.. ఉన్నా థియేటర్లో రిలీజ్ చేసిన సినిమాలు లాస్‌తో ఇబ్బంది పడుతున్న బాలీవుడ్.. మహారాష్ట్రలో థియేటర్లు ఓపెన్ చెయ్యడంతో సెలబ్రేట్ చేసుకుంటోంది. పోటీపడి మరీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి థియేటర్లో ఖర్చీఫ్ వేసుకుంటున్నారు స్టార్లు. అందరూ ఒకే సారి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చెయ్యడంతో బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ రిలీజ్ క్లాష్ ఎదురవుతోంది. ఈ లిస్ట్‌లో ఫస్ట్ ప్రభాస్, అక్షయ్ కుమార్ పోటీ పడుతున్నారు. అక్షయ్ కుమార్ ‘రక్షా బంధన్’ మూవీ ఆగస్ట్‌లో ఇండిపెండెన్స్ డే వీకెండ్‌కి రిలీజ్ అవుతుంటే.. ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ ఆగస్ట్ 11న రిలీజ్‌కు రెడీ అవుతోంది.

Adipurush Raksha Bandhan

 

బాలీవుడ్‌లో మరో రిలీజ్ క్లాష్.. బన్నీకి, రణ్‌వీర్ సింగ్‌కి. బాలీవుడ్‌లో తన సినిమాలకు మంచి క్రేజ్ ఉన్న అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాని పాన్ ఇండియా లెవల్లో క్రిస్మస్‌కి రిలీజ్ చేస్తున్నారు. అదే క్రిస్మస్‌కి వరల్డ్ కప్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన రణ్‌వీర్ సింగ్ ‘83’ మూవీ కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది.

83 Pushpa

 

ఈ సంవత్సరమే రిలీజ్ క్లాష్‌కి తెరలేపారు.. అక్షయ్ కుమార్. అది కూడా ఏకంగా సౌత్ స్టార్ హీరో రజనీ కాంత్‌తో. సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా మంచి క్రేజ్ ఉన్న రజనీ కాంత్.. భారీ బడ్జెట్‌తో పాటు భారీ స్టార్ కాస్ట్‌తో తెరకెక్కిస్తున్న ‘అన్నాత్తే’ మూవీ నవంబర్ 4న దీపావళి కానుకగా రిలీజ్ అవుతోంది. ఇక అదే దీపావళికి అజయ్ దేవ్‌గణ్, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, కత్రినా కైఫ్ నటించిన బాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. ‘సూర్యవంశీ’ కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది.

Annaatthe First Look : ‘అన్నాత్తే’ లుక్ అదిరిందిగా..!

ఆల్రెడీ దీపావళి సీజన్ ఫుల్‌గా బ్లాక్ అయిపోయి ఉంటే.. అదే సీజన్‌లో నవంబర్ 5న హాలీవుడ్ మూవీ మార్వెల్ స్టూడియోస్ ‘ఎటర్నల్స్’ కూడా ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మళయాళంలో రిలీజ్ అవుతూ ఈ బిగ్గెస్ట్ రిలీజ్ క్లాష్‌లో జాయిన్ అవుతోంది.

MAA Elections 2021 : నేటితో నామినేషన్ల పర్వానికి తెర..

టైగర్ ష్రాష్ సూపర్ హిట్ మూవీ ‘హీరోపంతీ’ కి సీక్వెల్‌గా వస్తున్న ‘హీరోపంతి 2’ ఏప్రిల్ 29 న ఈద్ సీజన్‌లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. అజయ్ దేవ్‌గణ్ మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘మేడే’ కూడా ఈద్‌కే ఏప్రిల్ 29 నే వద్దామని డిసైడ్ అయ్యింది. వీళ్లే కాకుండా ప్రతి ఈద్‌కి కంపల్సరీగా సినిమా రిలీజ్ చేసే స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ ని ఈద్‌కి రిలీజ్ చెయ్యాలనుకుంటే అది నెవర్ బిఫోర్ బాలీవుడ్ క్లాష్ అవ్వడంతో ఏమాత్రం డౌట్ లేదు.

Top Trolling Videos : మోస్ట్ ట్రోలింగ్ వీడియోస్ ఇవే..!

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేస్తున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ రిలీజ్ క్లాష్ ఫేస్ చేస్తున్న హీరో అయిపోయారు. ఆల్రెడీ ‘రక్షా బంధన్’, ‘సూర్యవంశీ’ సినిమాలతో క్లాష్ ఫేస్ చేస్తున్న అక్కీ.. ఈసారి హాలీవుడ్ ‘బ్యాట్ మ్యాన్’ తో క్లాష్ అవుతున్నారు. ‘బచ్చన్ పాండే’ మార్చ్ 4న రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. అదే సీజన్‌లో హాలీవుడ్ సూపర్ హీరో యాక్షన్ మూవీ ‘ది బ్యాట్ మ్యాన్’ కూడా రిలీజ్ అవుతోంది. ఇలా వరుస పెట్టి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చెయ్యడంతో బాలీవుడ్‌లో రిలీజ్ క్లాష్ ఈసారి గట్టిగానే జరగబోతోంది.