Radhe Shyam: కంప్లీట్ రొమాంటిక్‌గా ప్రభాస్.. ఫ్యాన్స్ ఖుషీ!

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగొచ్చింది. బ్యాక్ టూ బ్యాక్ సాంగ్ రిలీజ్ లతో పండగ చేసుకుంటున్నారు ప్రభాస్ ఫాన్స్. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ డైరెక్షన్లో సంక్రాంతి రిలీజ్ కు ..

Radhe Shyam: కంప్లీట్ రొమాంటిక్‌గా ప్రభాస్.. ఫ్యాన్స్ ఖుషీ!

Radhe Shyam

Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగొచ్చింది. బ్యాక్ టూ బ్యాక్ సాంగ్ రిలీజ్ లతో పండగ చేసుకుంటున్నారు ప్రభాస్ ఫాన్స్. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ డైరెక్షన్లో సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా రాధేశ్యామ్. మూడేళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా ఇప్పుడిప్పుడే ప్రమోషన్ల మూడ్ లోకి వచ్చింది. ఈ మధ్య బ్యాక్ టూ బ్యాక్ యాక్షన్ సినిమాలతో రొమాన్స్ ని పక్కన పెట్టేసిన ప్రభాస్.. కంప్లీట్ రొమాంటిక్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. టీజర్ తోనే ఫ్యాన్స్ ని ప్రభాస్, పూజాహెగ్డే రొమాంటిక్ మూడ్ లోకి తీసుకెళ్లి మెస్మరైజింగ్ చేశారు.

Alia Ranbir: అలియా లెహంగా రణబీర్ కాలితో.. వీడియో వైరల్!

మొన్నీమధ్యనే ఈ రాతలే అంటూ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన రాధేశ్యామ్ టీమ్.. లేటెస్ట్ గా నగుమోము తారలే అంటూ సిద్ శ్రీరామ్ పాడిన రొమాంటిక్ సాంగ్ ని రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. సోమవారం ఈ పాట ఎలా ఉండబోతుందో ప్రోమోలో శాంపిల్ చూపించడంతో ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న రాధేశ్యామ్ ఈ రొమాంటిక్ సాంగ్ టీజర్ ని ఒకేసారి రిలీజ్ చెయ్యలేదు. ముందుగా హిందీ టీజర్ రిలీజ్ చేశారు. ఆషికీ ఆగయా అంటూ ఫస్ట్ హిందీలో రిలీజ్ అయిన ఈ పాట స్టార్ సింగర్ అరిజిత్ సింగర్ పాడారు.

Bimbisara: కళ్యాణ్ రామ్ ఊహించని ట్రాన్స్‌ఫర్మేషన్.. కలిసొచ్చేనా?

తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం టీజర్స్ ని ఒకేసారి రిలీజ్ చేసింది రాధేశ్యామ్ టీమ్. బాహుబలి దగ్గరనుంచి రొమాన్స్ ని పెద్దగా పట్టించుకోని ప్రభాస్.. రాదేశ్యామ్ లో మాత్రం అవుట్ అండ్ అవుట్ లవర్ బాయ్ గా కనిపిస్తున్నారు. రాదేశ్యామ్ లో ఈ పాట టీజర్ చూసిన ఫ్యాన్స్ అందరూ మా డార్లింగ్ మళ్లీ దార్లో పడ్డాడు అంటూ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రభాస్, పూజాహెగ్డే కెమిస్ట్రీ ఆడియన్స్ కి బ్యూటిఫుల్ గా కనెక్ట్ అవ్వడంతో.. సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి.

Bigg Boss 5: షన్నుకు సిరి హగ్గులు.. ఫీలింగ్స్‌ భయంతో పింకీ-మానస్ దూరం!

ప్రభాస్ సినిమా నుంచి పోస్టర్ వచ్చినా కూడా ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ కి పండగే. అలాంటిది.. ఏకంగా రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేస్తుండడంతో తెగ ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. రెట్రోలవ్ స్టోరీ కావడంతో అప్పటి లుక్ తో ప్రభాస్, పూజాహెగ్డే బ్యూటిఫుల్ లొకేషన్స్ తో ఆడియన్స్ ని కట్టిపడేస్తున్నారు. 300 కోట్ల బడ్జెట్ తో యూరోపియన్ బ్యాక్ డ్రాప్ లో ఇటలీ, జార్జియాలోని రిచ్ లొకేషన్స్ లో తెరకెక్కిన ఈ క్రేజీ లవ్ స్టోరీ కోసం ఫ్యాన్స్ చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు.
కంప్లీట్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ప్రభాస్ ని సరికొత్త క్యారెక్టర్ లో చూపిస్తున్న ఈ సినిమా జనవరి 14న రిలీజ్ అయ్యి రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమంటూ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్.