Prabhas: ప్రభాస్ బాడీ బిల్డింగ్ తిప్పలు.. రెస్ట్ కోసం ఫారిన్ టూర్?

టాలీవుడ్ లో మరే ఇతర హీరోకు అందనంత విధంగా ప్రభాస్ ప్రస్తుతం భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాలను ఒకేసారి లైన్లో పెట్టేస్తున్నారు. సాధారణంగా ఒక్క సినిమాకి కనీసం 1నుంచి రెండు..

Prabhas: ప్రభాస్ బాడీ బిల్డింగ్ తిప్పలు.. రెస్ట్ కోసం ఫారిన్ టూర్?

Prabhas

Prabhas: టాలీవుడ్ లో మరే ఇతర హీరోకు అందనంత విధంగా ప్రభాస్ ప్రస్తుతం భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాలను ఒకేసారి లైన్లో పెట్టేస్తున్నారు. సాధారణంగా ఒక్క సినిమాకి కనీసం 1నుంచి రెండు సంవత్సరాలు టైమ్ తీసుకునే ప్రభాస్.. ఇప్పుడు ఒకేసారి 3 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక సినిమాలో రాముడిగా, మరో సినిమాలో లవర్ గా, ఇకో సినిమాలో మాస్ హీరోగా ఇలా డిఫరెంట్ లుక్ తో డిఫరెంట్ బాడీస్ ని మెయింటెన్ చేస్తున్నాడు. అయితే, ఇప్పుడు అదే ప్రభాస్ కు తిప్పలు తెచ్చిపెట్టింది.

Horror Movies: బంపర్ అఫర్.. ఈ హార్ర‌ర్ సినిమాలు చూస్తే రూ.ల‌క్ష పారితోష‌కం!

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూడు సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ షూట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆల్రెడీ రాదేశ్యామ్ రిలీజ్ కు రెడీ గా ఉంటే.. మిగతా మూడు సినిమాలు ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ మూడు సినిమాల్లో క్యారెక్టర్స్ డిఫరెంట్ కావడంతో.. వాటికి తగినట్టు బాడీని మౌల్డ్ చేస్కోవడంతో ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు. అందుకే ఈ మధ్య ప్రభాస్ లుక్, బాడీ మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్స్ జరుగుతున్నాయి.

Big Boss 5: సవాళ్లు.. మధ్యలో నానాబూతులు.. ఇది నిజంగా ‘మండే’నే!

ప్రస్తుతం ప్రభాస్ ఓమ్ రౌత్ తో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రాముడిగా పెద్దగా మస్క్యులర్ బాడీ లేకుండా కనిపించాల్సి ఉంటుంది. ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేుస్తున్నాడు. ఈ సినిమాలో మాస్ హీరోగా ఫుల్ మజిల్స్ తో బాడీ మెయింటెన్ చెయ్యాల్సి ఉంటుంది. మరో దర్శకుడు నాగశ్విన్ తో మరో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం కూడా లుక్ వైజ్ డిఫరెన్స్ చూపించాల్సి ఉంటుంది. దాంతో ప్రభాస్ వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ తో ఇబ్బంది పడుతున్నాడు.

Bigg Boss 5: వారానికి సరయూ అందుకున్న పారితోషకం ఇదే?

ఒక్కసారిగా వెయిట్ పెరగడం తగ్గడంతో ఇష్యూస్ ఫేస్ చేస్తున్న ప్రభాస్.. సోషల్ మీడియాలో కూడా భారీ ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్నాడు. అందుకే ఇప్పుడు తన బాడీ మీద కాన్సన్ ట్రేట్ చేశారు. ఫిజిక్ లో తేడాలు కనిపించడంతో డాక్టర్ తో టెస్ట్ చేయించాలని డిసైడ్ అయ్యాడట. ఫారెన్ లో వరల్డ్ క్లాస్ డైటీషియన్స్ తో టెస్ట్ చేయించుకుని అసలు ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే పనిలో పడినట్లు తెలుస్తుంది. అందుకే ఫుల్ బాడీ టెస్ట్ కోసం ఫారెన్ వెళుతున్నాడని టాలీవుడ్ లో ఓ టాక్ వైరల్ అవుతోంది.