Prabhas : జపాన్‌లో ప్రభాస్ బాటిల్స్.. పెద్ద సంస్థే ప్రభాస్ ఫొటోని వాడేస్తుందిగా

'సాహో' జపాన్ లో పెద్ద హిట్ అయింది. జపాన్ లో ప్రభాస్ అభిమానులు విపరీతంగా పెరిగారు. అక్కడి స్టార్ హీరోల్లో ఒకరిగా ప్రభాస్ స్థానం సంపాదించారు. ప్రభాస్ పేరుతో అక్కడ చాలా బిజినెస్ లు...

Prabhas : జపాన్‌లో ప్రభాస్ బాటిల్స్.. పెద్ద సంస్థే ప్రభాస్ ఫొటోని వాడేస్తుందిగా

Prabhas

Prabhas :    ‘బాహుబలి’ సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. కేవలం మన దేశంలోనే కాక విదేశాల్లోనూ ప్రభాస్ కి విపరీతమైన అభిమానులు ఉన్నారు. చైనా, రష్యా, జపాన్, కొన్ని యూరప్ దేశాల్లో ప్రభాస్ కి ఫ్యాన్స్ ఎక్కువే ఉన్నారు. ‘బాహుబలి’ సినిమా ఆ దేశాల్లో కూడా బాగా ఆడింది. ఆ తర్వాత ‘సాహో’ సినిమా కూడా జపాన్ లో పెద్ద హిట్ అయింది. దీంతో జపాన్ లో ప్రభాస్ కి అభిమానులు విపరీతంగా పెరిగారు. అక్కడి స్టార్ హీరోల్లో ఒకరిగా ప్రభాస్ కూడా స్థానం సంపాదించారు.

Ram Charan : 100 కోట్ల రెమ్యునరేషన్ నాకెవరిస్తారు?? : రామ్ చరణ్

దీంతో ప్రభాస్ పేరుతో అక్కడ చాలా బిజినెస్ లు జరుగుతున్నాయి. చాలా షాప్స్ కి ప్రభాస్ ఫోటోలని వాడేస్తున్నారు. అంతేకాక జపాన్ లో ప్రభాస్ బాహుబలి గెటప్ బొమ్మలతో పాటు సాహోలో అతని గెటప్‌కు సంబంధించిన బొమ్మలు, టాయ్స్, చాకోలెట్స్, డ్రెస్సెస్… ఇలా అనేక రకాల వస్తువులు ప్రభాస్ ఫొటోలతోనో, ప్రభాస్ పేరుతోనో కనిపిస్తాయి. తాజాగా జపాన్‌ లోని ఐకియాలో ప్రభాస్ ఫోటోలు పెట్టిన ఖాళి బాటిల్స్ అమ్మకానికి పెట్టారు. ఖాళి గాజు సీసాల లేబుల్స్ పై ప్రభాస్ ఫోటో ఉండటం విశేషం. అయితే ఇవి ఫేమస్ హౌస్ హోల్డింగ్ ప్రోడక్ట్స్ అమ్మే ఐకియాలో అమ్ముతుండటం విశేషం. దీంతో ఈ బాటిల్స్ ని అక్కడి ప్రభాస్ ఫ్యాన్స్ విపరీతంగా కొనేస్తున్నారట. సోషల్ మీడియాలో ప్రభాస్ పిక్స్ ఉన్న ఈ ఖాళీ బాటిల్స్ వైరల్ అవుతున్నాయి.