Prabhas : ప్రభాస్ సిగ్గుపడతాడు.. కాని కుదిరినప్పుడల్లా డిన్నర్ కి పిలుస్తాడు

ప్రభాస్ తన టీంకి అప్పుడప్పుడు ఇంటి దగ్గర్నుంచి తెప్పించిన ఫుడ్ తో ట్రీట్ ఇస్తాడు. ప్రభాస్ తో వర్క్ చేసిన హీరోయిన్స్, టీం అంతా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్ తెప్పించిన ఫుడ్

Prabhas : ప్రభాస్ సిగ్గుపడతాడు.. కాని కుదిరినప్పుడల్లా డిన్నర్ కి పిలుస్తాడు

Prabhas (1)

Prabhas :  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. త్వరలో ప్రభాస్ బర్త్ డే కి ‘రాధేశ్యామ్’ సినిమా నుంచి టీజర్ విడుదల అవ్వనుందని చిత్రబృందం ప్రకటించారు. ఇక సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేస్తామని ఇప్పటికే అనౌన్స్ చేశారు. అభిమానులు ఎంతో ఆతృతగా ఈ టీజర్, సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’, ‘ఆదిపురుష్’ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ తన టీంకి అప్పుడప్పుడు ఇంటి దగ్గర్నుంచి తెప్పించిన ఫుడ్ తో ట్రీట్ ఇస్తాడు.

ప్రభాస్ తో వర్క్ చేసిన హీరోయిన్స్, టీం అంతా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్ తెప్పించిన ఫుడ్ ఫోటోలు పెట్టి ప్రభాస్ అందరికి కడుపునిండా ఆంధ్ర స్పెషల్ భోజనం పెడ్తాడు అని పోస్ట్ చేశారు. ఇటీవల ‘సలార్’ చిత్రీకరణ షూటింగ్ లో శృతి హాసన్ కూడా సోషల్ మీడియాలో ప్రభాస్ మంచి ఫుడ్ పెట్టిస్తాడు అని పోస్ట్ చేసింది. ఇప్పటికే ఇలా చాలా మంది హీరోయిన్స్ పోస్ట్ చేశారు. తాజాగా ‘ఆదిపురుష్’ సినిమాలో సీతగా నటిస్తున్న కృతి సనన్ ప్రభాస్ గురించి ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది.

Maheshbabu : ‘లవ్ స్టోరీ’తో మహేష్ బాబుకి లాభం

కృతి సనన్ ప్రభాస్ గురించి చెప్తూ.. ప్రభాస్ కి కొంచెం సిగ్గు ఎక్కువ. కొత్తవాళ్లతో మాట్లాడేందుకు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. కాని ఒకసారి కనెక్ట్ అయితే మాత్రం వారితో చాలా క్లోజ్‌గా ఉంటాడు. జోకులు వేస్తాడు. ప్రభాస్ దగ్గర ఎప్పుడూ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి . సెట్స్ లో అందరూ తెలిసిన వాళ్లే కాబట్టి ప్రభాస్ జోకులతో అందర్నీ నవ్విస్తూ ఉంటాడు. ఇక ప్రభాస్ వీలుచిక్కినప్పుడల్లా తన కో-స్టార్స్ ని డిన్నర్ పార్టీకి పిలుస్తూ ఉంటాడు. డిన్నర్ లో హైదరాబాద్ బిర్యానీ, ఆంధ్ర రుచులని పరిచయం చేస్తుంటాడు. ఆ ఫుడ్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అని కృతి సనన్ తెలిపింది.