Prabhas : మా అమ్మ కంగారుపడుద్ది.. పెళ్లి రూమర్స్ పై ప్రభాస్ వ్యాఖ్యలు..

ఏడో ఎపిసోడ్ లో ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. ప్రభాస్ పెళ్లి పై వచ్చే రూమర్స్ గురించి మాట్లాడుతూ అవన్నీ అబద్దం, ఇష్టమొచ్చినట్టు సోషల్ మీడియాలో రాస్తున్నారు అంటూ ప్రభాస్ అన్నాడు. ఇదే టాపిక్ గోపీచంద్ వచ్చాక ఈ ఎపిసోడ్ లో కూడా కంటిన్యూ అయింది. ప్రభాస్ మీద వచ్చిన ఓ రూమర్ ని..........

Prabhas : మా అమ్మ కంగారుపడుద్ది.. పెళ్లి రూమర్స్ పై ప్రభాస్ వ్యాఖ్యలు..

prabhas comments on his marriage rumors in unstoppable

Prabhas :  బాలకృష్ణ యాంకర్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్ షో ఎంతో గ్రాండ్ సక్సెస్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే రెండో సీజన్ లో కూడా ఏడు ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. ఏడో ఎపిసోడ్ లో ప్రభాస్ వచ్చి అలరించాడు. ఈ ఎపిసోడ్ కి భారీ స్పందన వచ్చింది. ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు దేశవ్యాప్తంగా ఈ షోని చూశారు. ప్రభాస్ ఎపిసోడ్ తో ఆహా ఓటీటీకి బాగా రీచ్ వచ్చింది. అయితే ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా టెలికాస్ట్ చేయాలనుకున్నారు.

ఏడో ఎపిసోడ్ లో కేవలం ప్రభాస్ తో నడిపించి ఎనిమిదో ఎపిసోడ్ లో ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్, హీరో గోపీచంద్ ని కూడా తీసుకొచ్చారు. వీరి కాంబినేషన్ ఎపిసోడ్ నేడు జనవరి 6 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో ఈ ఎపిసోడ్ కూడా ప్రేక్షకుల్లో బాగా రీచ్ అవుతుంది. ఎనిమిదో ఎపిసోడ్ లో బాలయ్యతో కలిసి ప్రభాస్, గోపీచంద్ రచ్చ రచ్చ చేశారు. ఎపిసోడ్ ఆద్యంతం నవ్వించారు, అలరించారు, ఎన్నో గుర్తుండిపోయే మూమెంట్స్ ని ప్రేక్షకులకి అందించారు.

Project – K : ప్రాజెక్ట్-K ఆలోచన రావడమే గొప్ప విషయం.. సాయి మాధవ్‌ బుర్రా!

ఏడో ఎపిసోడ్ లో ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. ప్రభాస్ పెళ్లి పై వచ్చే రూమర్స్ గురించి మాట్లాడుతూ అవన్నీ అబద్దం, ఇష్టమొచ్చినట్టు సోషల్ మీడియాలో రాస్తున్నారు అంటూ ప్రభాస్ అన్నాడు. ఇదే టాపిక్ గోపీచంద్ వచ్చాక ఈ ఎపిసోడ్ లో కూడా కంటిన్యూ అయింది. ప్రభాస్ మీద వచ్చిన ఓ రూమర్ ని స్క్రీన్ పై చూపించాడు బాలయ్య. దాంట్లో ప్రభాస్ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడని, ప్రభాస్ తో ఒక అమ్మాయి ఫేస్ కనపడకుండా పెళ్లి బట్టల్లో ఉన్న ఫోటోని చూపించారు. అది చూసి ప్రభాస్ షాక్ అయ్యారు. ఇదేంట్రా ఇంత బాగా ఎవరు ఎడిట్ చేశార్రా అని అన్నాడు. ఇలాంటివి చూపించకండి సర్ ఇవన్నీ అబద్దం, ఇలాంటివి చూస్తే మా అమ్మ కంగారు పడుతుంది అని అన్నాడు ప్రభాస్. ఇప్పుడు పెళ్లిపై నేనేం మాట్లాడినా వాళ్ళు ఇష్టమొచ్చినట్టు రాసేసుకుంటారు అని అన్నాడు. దీంతో బాలయ్య షోలో ఇవన్నీ సరదాగా మాట్లాడుతున్నాం షో చూసి ఇష్టమొచ్చినట్టు రాయకండి అని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు.