Eeswar Movie : ప్రభాస్ 20 ఏళ్ళు.. ప్రభాస్ గురించి కృష్ణంరాజు వ్యాఖ్యలు..

ప్రభాస్ హీరోగా మారి ఇరవై ఏళ్ళు అయిన సందర్భంగా ఆలిండియా రెబెల్ స్టార్ కృష్ణం రాజు, ప్రభాస్ ఫాన్స్ అధ్యక్షడు జెఎస్ఆర్ శాస్త్రి ఆధ్వర్యంలో మంగళవారం హైద్రాబాద్ లోని కృష్ణంరాజు ఇంట్లో..........

Eeswar Movie : ప్రభాస్ 20 ఏళ్ళు.. ప్రభాస్ గురించి కృష్ణంరాజు వ్యాఖ్యలు..

Prabhas

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారి 20 ఏళ్ళు పూర్తయింది. ప్రభాస్‌ హీరోగా తొలిసారి కెమెరా ముందుకు 28 జూన్‌ 2002న వచ్చాడు. రామానాయుడు స్టూడియోలో ప్రభాస్ హీరోగా పరిచయం అవుతూ ఈశ్వర్ సినిమాని మొదలుపెట్టారు. అశోక్ కుమార్ నిర్మాతగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ఈశ్వర్ సినిమా తెరకెక్కింది. హీరోగా ప్రభాస్ మొదటిసారి కెమెరా ముందుకి వచ్చి 20 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా సెలబ్రేషన్స్ నిర్వహించారు.

ప్రభాస్ హీరోగా మారి ఇరవై ఏళ్ళు అయిన సందర్భంగా ఆలిండియా రెబెల్ స్టార్ కృష్ణం రాజు, ప్రభాస్ ఫాన్స్ అధ్యక్షడు జెఎస్ఆర్ శాస్త్రి ఆధ్వర్యంలో మంగళవారం హైద్రాబాద్ లోని కృష్ణంరాజు ఇంట్లో ఈ సెలెబ్రేషన్స్ జరిగాయి. దర్శకుడు జయంత్ సి పరాన్జీ, నిర్మాత అశోక్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెబెల్ స్టార్ కృష్ణంరాజు కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు

Nikki Tamboli : కోటి రూపాయల కారు కొన్న హీరోయిన్

అనంతరం కృష్ణంరాజు మాట్లాడుతూ.. ”ప్రభాస్ హీరోగా పరిచయం చేసి అప్పుడే 20 ఏళ్ళు అయిపోయాయా అనిపిస్తుంది. ఆ రోజు ప్రభాస్ ని హీరోగా మా గోపికృష్ణ బ్యానర్ లోనే పరిచయం చేద్దాం అనుకున్నాం కానీ ఒకరోజు నిర్మాత అశోక్ కుమార్, దర్శకుడు జయంత్ వచ్చి ప్రభాస్ ని పరిచయం చేసే అవకాశం ఇవ్వమని అడిగారు. ఈశ్వర్ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్న కథ, అందరికి నచ్చుతుందన్న నమ్మకంతో అశోక్ కుమార్ కు ఓకే చెప్పాం.”

Prabhas Eeswar

 

”జయంత్, అశోక్ కలిసి తీసిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుని ప్రభాస్ ని హీరోగా నిలబెట్టింది. ప్రభాస్ మొదటి సినిమా చూశాక పెద్ద హీరో అవుతాడని అనుకున్నాం కానీ ఇలా పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతాడు అనుకోలేదు. ఇదంతా ప్రభాస్ శ్రమ, పట్టుదల, అభిమానుల అండదండల వల్లే. ప్రభాస్ ఒక నటుడిగానే కాకుండా సాటి వారికి సహాయం చేసే గొప్ప గుణం కూడా ఉంది. ప్రభాస్ ఇలాగే మరింత ఎత్తుకు ఎదగాలని, మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు కూడా పలు చోట్ల సెలబ్రేషన్స్ నిర్వహించారు.