Salaar: వెర్రి ఫ్యాన్స్.. సలార్ అప్డేట్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటా!

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియాకే స్టార్. ఒకటి కాదు రెండు కాదు దాదాపు అరడజను పాన్ ఇండియా సినిమాలతో దాదాపు రెండు వేల కోట్ల సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న స్టార్ మన డార్లింగ్ ప్రభాస్.

Salaar: వెర్రి ఫ్యాన్స్.. సలార్ అప్డేట్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటా!

Salaar

Salaar: రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియాకే స్టార్. ఒకటి కాదు రెండు కాదు దాదాపు అరడజను పాన్ ఇండియా సినిమాలతో దాదాపు రెండు వేల కోట్ల సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న స్టార్ మన డార్లింగ్ ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ సినిమాలలో కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండగా కరోనా కారణంగా షూటింగ్ పూర్తి కాలేదు. త్వరలోనే మళ్ళీ షూటింగ్ మొదలు కానుంది.

Salaar: యష్ నెవర్ బిఫోర్ యాక్షన్.. అంతకుమించి ప్రభాస్ ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్!

ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో అత్యంత భారీ చిత్రంగా మారుతుందనే టాక్ వినిపిస్తూ వస్తుంది. అందాల భామ శృతి హాసన్ ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతి బాబు మరోసారి రఫ్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. కాగా, ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలవగా.. సలార్ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుండి అప్డేట్ వస్తుందా అని ప్రభాస్ అభిమానులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.

Salaar: గెట్ రెడీ అంటోన్న ప్రభాస్.. సలార్ అప్‌డేట్ అప్పుడే!

అయితే, ఎంతకీ సలార్ టీం నుండి అప్డేట్స్ లేకపోవడంతో ప్రభాస్‌ అభిమాని ఒకరు సలార్‌ అప్డేట్ ఇవ్వాలని లేదంటే సూసైడ్‌ చేసుకుంటానని డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌కు లెటర్‌ రాశాడు. మే చివరి వారంలోగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వలేదంటే సూసైడ్‌ చేసుకుంటానని రాసిన లెటర్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు లుక్స్ తప్ప ఎలాంటి అప్డేట్ ఇవ్వని ప్రశాంత్ నీల్ మరి ఇప్పుడు అభిమానుల వార్నింగ్స్ తో అయినా దిగివస్తాడేమో చూడాలి.