సల్మాన్ పాటకు…రవీనా టండన్ తో ప్రభాస్ డ్యాన్స్

  • Published By: veegamteam ,Published On : August 22, 2019 / 05:48 AM IST
సల్మాన్ పాటకు…రవీనా టండన్ తో ప్రభాస్ డ్యాన్స్

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ సాహో సినిమా భారీ రేంజ్‌లో ప్ర‌మోట్ చేస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 30న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు ప్రభాస్‌, శ్రద్ధ బాలీవుడ్‌ షోలలో పాల్గొంటున్నారు. 

రీసెంట్ గా సల్మాన్‌ ఖాన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘నచ్‌ బలియే 9’ డ్యాన్స్‌ రియాల్టీ షోలో పాల్గొన్నారు‌. ఈ సందర్భంగా ప్రభాస్‌ వేదికపై సందడి చేస్తూ.. షోకు జడ్జ్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ నటి రవీనా టాండన్‌ చీర కొంగును నోటితో పట్టుకుని ‘జుమ్మేకీ రాత్‌ హై’ సాంగ్ కి స్టెప్పులు వేశారు. అలాగే సల్మాన్, హ‌ృతిక్‌ లను కూడా ప్రభాస్ ఇమిటేట్ చేశాడు. అలా ప్రభాస్ చేసిన సందడి.. వాటికి సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ సినిమాలో నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, అరుణ్‌ విజయ్‌, మురళీ శర్మ, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.