Prabhas: చేతినిండా సినిమాలు.. ప్రభాస్ ప్లానింగ్ అదుర్స్ అంతే!

బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయిన రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఈసారి పాన్ వరల్డ్ స్థాయికి టార్గెట్ చేశాడు. వరసగా అరడజను సినిమాల లైనప్ సెట్ చేసిన ప్రభాస్ వందల కోట్ల బిజినెస్..

10TV Telugu News

Prabhas: బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయిన రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఈసారి పాన్ వరల్డ్ స్థాయికి టార్గెట్ చేశాడు. వరసగా అరడజను సినిమాల లైనప్ సెట్ చేసిన ప్రభాస్ వందల కోట్ల బిజినెస్ టార్గెట్ చేశాడు. ప్రస్తుతానికి ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా.. నెక్ట్స్ సమ్మర్ కు ఓమ్ రౌత్ ఆదిపురుష్ తీసుకురానున్నాడు. మరోవైపు సలార్ ని స్పీడప్ చేస్తూనే నాగశ్విన్ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లాడు. ఇవి కాకుండా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ సినిమాకు ముహూర్తం పెట్టేశాడు. రాధేశ్యామ్ నుండి స్పిరిట్ వరకు ప్రస్తుతం అరడజను సినిమాలతో ప్రభాస్ ఊపిరి సలపనంతగా బిజీ బిజీగా గడుపుతున్నాడు.

Bollywood Remakes: తెలుగు కథలకు బాలీవుడ్ ఫిదా.. రీమేక్స్ దండయాత్ర షురూ!

అయితే, అసలు ఇన్ని సినిమాల షూటింగ్ ఎలా చేస్తాడు? ఎలా కంప్లీట్ చేస్తాడు? అసలు షూటింగ్ ప్లాన్ ఏంటి అని బుర్రలు బద్దలుకొట్టేసుకున్న వాళ్లకి నెమ్మదిగా తన ప్లాన్ లీక్ చేస్తున్నాడు ప్రభాస్. ఏ సినిమాని ఎప్పుడు స్టార్ట్ చెయ్యాలి? ఎన్నాళ్లు చెయ్యాలి? ఎప్పుడు ఫినిష్ చెయ్యాలి? బాగా లెక్కలేసుకుని మరీ పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నాడు. ఆల్రెడీ ఆదిపురుష్ ని అవ్వగొట్టిన ప్రభాస్.. సలార్ ని స్పీడప్ చేస్తూ.. ప్రాజెక్ట్ కె ని పట్టాలెక్కిస్తున్నాడు. సలార్ షూట్ లో బిజీగా ఉన్న ప్రభాస్ నాగాశ్విన్ సినిమాలో నెక్ట్స్ మన్త్ జాయిన్ అవుతున్నాడు.

Mahesh Babu: త్వరలో సూపర్ స్టార్ మరో సైడ్ బిజినెస్?

వైజయంతీ మూవీస్ బ్యానర్ లో సంవత్సరంన్నర క్రితం అనౌన్స్ చేసిన సినిమా భారీ బడ్జెట్ తో ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. అమితాబ్ బచ్చన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా షూట్ ని ప్రభాస్ డిసెంబర్ 2 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. నెక్ట్స్ వీక్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసుకుంటున్న ఈ ప్రాజెక్ట్ కె మూవీ కోసం ప్రభాస్ దాదాపు 200 రోజులు కాల్షీట్స్ ఇచ్చాడు. ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోన్ నటిస్తున్న ఈ ప్యాన్ వరల్డ్ మూవీ సైఫై ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది.

Mannara Chopra: ఈ పోజు ఏంటో.. చీరకట్టులోనూ ఇంత హాటా!

ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసేశాడు నాగాశ్విన్. ఈ సినిమా కోసం ప్రభాస్ ని సరికొత్త లుక్ లో చూపించడానికి ఆల్రెడీ లుక్ టెస్ట్ లు కూడా చేసిన నాగాశ్విన్.. నెక్ట్స్ మన్త్ నుంచి సినిమాని స్పీడప్ చేస్తున్నాడు. మరోవైపు రాధేశ్యామ్ ని రిలీజ్ కు రెడీ చేసి, ఆదిపురుష్ షూట్ ని కంప్లీట్ చేసిన ప్రభాస్.. సలార్ ని జెట్ స్పీడ్ లో షూట్ చేస్తూనే.. ప్రాజెక్ట్ కె.లో జాయిన్ అవుతున్నాడు. ఇవి రెండిటిలో ఒకటి పూర్తి కాగానే సందీప్ రెడ్డి వంగాతో కలిసి స్పిరిట్ ను మొదలు పెట్టనున్నాడు. ఈలోగా సందీప్ ప్రీ ప్రొడక్షన్, మిగతా షూటింగ్ పనులను చూసుకోనున్నాడు.

×