Unstoppable : కృష్ణంరాజుని తలుచుకొని ఏడ్చేసిన ప్రభాస్.. అన్‌స్టాపబుల్ స్టేజిపై రెబల్ స్టార్‌కి నివాళులు..

ఇక ఇటీవల ప్రభాస్ పెదనాన్న, హీరో కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఎపిసోడ్ లో ఆయన గురించి కూడా మాట్లాడారు. ప్రభాస్ ని గతంలో కృష్ణంరాజు పొగిడిన వీడియోలు చూపించారు. అనంతరం కృష్ణంరాజుకి నివాళులు అర్పిస్తూ..................

Unstoppable : కృష్ణంరాజుని తలుచుకొని ఏడ్చేసిన ప్రభాస్.. అన్‌స్టాపబుల్ స్టేజిపై రెబల్ స్టార్‌కి నివాళులు..

Prabhas emotional while remembering Krishnam Raju in Unstoppable show

Unstoppable :  బాలకృష్ణ యాంకర్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్ షో ఎంతో గ్రాండ్ సక్సెస్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే రెండో సీజన్ లో కూడా ఏడు ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. ఏడో ఎపిసోడ్ లో ప్రభాస్ వచ్చి అలరించాడు. ఈ ఎపిసోడ్ కి భారీ స్పందన వచ్చింది. ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు దేశవ్యాప్తంగా ఈ షోని చూశారు. ప్రభాస్ ఎపిసోడ్ తో ఆహా ఓటీటీకి బాగా రీచ్ వచ్చింది. అయితే ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా టెలికాస్ట్ చేయాలనుకున్నారు.

ఏడో ఎపిసోడ్ లో కేవలం ప్రభాస్ తో నడిపించి ఎనిమిదో ఎపిసోడ్ లో ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్, హీరో గోపీచంద్ ని కూడా తీసుకొచ్చారు. వీరి కాంబినేషన్ ఎపిసోడ్ నేడు జనవరి 6 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో ఈ ఎపిసోడ్ కూడా ప్రేక్షకుల్లో బాగా రీచ్ అవుతుంది. ఎనిమిదో ఎపిసోడ్ లో బాలయ్యతో కలిసి ప్రభాస్, గోపీచంద్ రచ్చ రచ్చ చేశారు. ఎపిసోడ్ ఆద్యంతం నవ్వించారు, అలరించారు, ఎన్నో గుర్తుండిపోయే మూమెంట్స్ ని ప్రేక్షకులకి అందించారు.

ఇక ఇటీవల ప్రభాస్ పెదనాన్న, హీరో కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఎపిసోడ్ లో ఆయన గురించి కూడా మాట్లాడారు. ప్రభాస్ ని గతంలో కృష్ణంరాజు పొగిడిన వీడియోలు చూపించారు. అనంతరం కృష్ణంరాజుకి నివాళులు అర్పిస్తూ రెండు నిముషాలు మౌనం పాటించారు. అభిమానులు జోహార్ రెబల్ స్టార్ అంటూ నినాదాలు చేశారు. అలాగే కృష్ణంరాజు, ప్రభాస్ ని కలిపి వారి సినిమాల్లోంచి ఒకేలా ఉన్న విజువల్స్ ని తీసి అభిమానులు ఓ వీడియో చేయగా దాన్ని ప్లే చేశారు.

Prabhas : సమంతని వదిలేసి దీపికా పదుకొనెని కాపాడుతా అన్న ప్రభాస్.. ఎందుకో తెలుసా??

ఇక ప్రభాస్ కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ..మొగల్తూరు నుంచి ఇక్కడికి వచ్చి, ఇంట్లో వద్దన్నా సినిమాలు చేసి, మొదట చాలా సినిమాలు ఫెయిల్ అయినా ఇక్కడే నిలబడి, కష్టపడి సక్సెస్ అయ్యారు. ఆయన వల్లే మా కుటుంబం అంతా నిలబడింది. అయన లేకపోతే మా కుటుంబం లేదు. ఆయన మరణించే నెల రోజుల ముందు నుంచే ఆరోగ్యం బాగోలేదు. చివరి రోజు నేను హాస్పిటల్ లోనే ఉన్నాను, డాక్టర్స్ తో మాట్లాడాను. అయన చనిపోయినప్పుడు నేను హాస్పిటల్ లోనే ఉన్నాను అంటూ ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రభాస్. పెదనాన్నని తలుచుకుంటూ ప్రభాస్ చాలా ఎమోషనల్ అయ్యాడు.