Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. మార్చి 2న మరో ట్రైలర్!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డేల రొమాంటిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సంక్రాంతికే విడుదల కావాల్సి ఉండగా అప్పుడు దేశంలో కరోనా..

Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. మార్చి 2న మరో ట్రైలర్!

Radhe Shyam

Radhe Shyam: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డేల రొమాంటిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సంక్రాంతికే విడుదల కావాల్సి ఉండగా అప్పుడు దేశంలో కరోనా కేసుల పెరుగుదలతో చివరి క్షణంలో వాయిదా వేసుకున్నారు. కానీ ఈసారి సమ్మర్ రిలీజ్ ప్రభాస్ అభిమానులకు ట్రీట్ ఇవ్వడం పక్కా అంటున్న మేకర్స్ మార్చి రెండో వారంలో ముహూర్తం పెట్టేశారు.

Radhe Shyam: థియేటర్స్‌లో ఆస్ట్రాలజీ కౌంటర్.. వాట్ యాన్ ఐడియా!

దీంతో కాస్త ఆలస్యంగా అయినా ప్రమోషన్స్ మొదలు పెట్టిన మేకర్స్ వరసగా అప్డేట్స్ ఇచ్చి అభిమానులను ఖుషీ చేస్తున్నారు. వాలంటైన్ డే రోజున గ్లిమ్ప్స్ రిలీజ్ చేసిన రాధేశ్యామ్ యూనిట్ ఆ తర్వాత ఈ రాతలే వీడియో సాంగ్ రిలీజ్ చేసి సినిమా మీద అంచనాలను భారీగా పెంచేశారు. ఒకపక్క ఇంటర్వ్యూలు కూడా మొదలు పెట్టిన మేకర్స్ ఏకంగా అభిమానులకు పండగ చేసుకొనేందుకు మరో గిఫ్ట్ రెడీ చేసి డేట్ ఇచ్చేశారు.

Radhe Shyam: ప్రపంచంలోనే తొలి సినిమా ఇదే.. డైరెక్టర్ రాధాకృష్ణ

జనవరిలో రిలీజ్ సందర్భంగా అప్పుడు ఒక ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు మార్చి 2న రాధేశ్యామ్ సినిమా మరో ట్రైలర్ విడుదల చేసేందుకు ముహూర్తం పెట్టేశారు. మార్చి 2 సాయంత్రం 3 గంటలకి ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇప్పటికే వచ్చిన సాంగ్స్, గ్లిమ్ప్స్ చూసిన ఫ్యాన్స్ ఇదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని చెప్పుకుంటున్నారు. ప్రభాస్ ను చాలాకాలం తర్వాత కూల్ బాయ్ గా చూసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్న వాళ్ళకి ఈ ట్రైలర్ పండగే అవుతుంది.