RRR Update: హర్ట్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..

  • Published By: sekhar ,Published On : October 7, 2020 / 04:23 PM IST
RRR Update: హర్ట్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..

Prabhas – NTR: రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ.. ‘‘RRR – రౌద్రం రణం రుధిరం’’.. షూటింగ్ దాదాపు ఏడు నెలల తర్వాత తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా మేకింగ్ వీడియోతో పాటు తారక్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ట్రీట్ ఇవ్వనున్నట్లు మూవీ టీమ్ తెలియజేశారు.

ఈ అప్‌డేట్‌తో తారక్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోయి కేక్ కటింగ్స్ కూడా చేసేశారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ట్రిపుల్ ఆర్ కి ప్రభా అభిమానులకి సంబంధం ఏంటంటే ఏమీ లేదు కానీ.. టాలీవుడ్ లో చాలా కాలంగా షూటింగ్స్ జరుపుకుంటున్న ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ అప్‌డేట్స్ అండ్ టీజర్స్ గురించి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇప్పుడు ఆర్ఆర్ఆర్ టీజర్ పై యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. సరిగ్గా ఇదే ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించింది. ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ టీజర్ కు సంబంధించి విజువల్స్ కూడా లేవు. నిన్ననే షూటింగ్ ప్రారంభించి, అప్పుడే టీజర్ రిలీజ్ డేట్ ఇచ్చేశారు. కానీ కావాల్సినంత ఫుటేజ్ పెట్టుకొని కూడా రాధే శ్యామ్ టీజర్ డేట్ చెప్పకపోవడం ఏంటని యూవీ క్రియేషన్స్ నిర్మాతలపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్యాన్స్ ఆవేశానికి నిప్పు మీద ఉప్పు వేసినట్టుగా ఆదిపురుష్ కూడా తోడైంది. నిన్నగాక మొన్న ప్రకటించిన ఆదిపురుష్ సినిమాకు సంబంధించి వరుస అప్‌డేట్స్  తో దంచి కొడుతున్నారు. ఆగస్ట్ లో సినిమా ఎనౌన్స్ చేస్తే, సెప్టెంబర్ లో విలన్ ఎవరనేది రివీల్ చేశారు. ఇక ఈనెల అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా హీరోయిన్‌ను ప్రకటించబోతున్నారట.

ఆదిపురుష్ విషయంలో బాలీవుడ్ టీమ్ చూపిస్తున్న స్పీడులో కొంచెం అంటే కొంచెం కూడా రాధే శ్యామ్ యూనిట్ లో లేదంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలుపెట్టారు. మొత్తమ్మీద ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ టీజర్ డేట్ బయటకు రావడంతో.. ఊహించని విధంగా రాధే శ్యామ్ యూనిట్ పై ఒత్తిడి పెరిగింది.

కనీసం ప్రభాస్ పుట్టిన రోజుకైనా టీజర్ వస్తున్నట్టు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ప్రకటిస్తే బాగుండేది. అయినా వాళ్లకు ఇలాంటి ట్రోలింగ్స్ కొత్తేంకాదు, బాగా అలవాటుపడిపోయారు ఇలాంటి వాటికి.. అయినా సరే ప్రభాస్ అప్‌‌డేట్ ఇచ్చే వరకు సోషల్ మీడియా ద్వారా నిర్మాతలపై ఒత్తిడి తెస్తాం అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్..

NTR