Prabhas : ‘హాయ్ మేడమ్.. ఐ యామ్ ప్రభాస్ ఫ్రమ్ మొగల్తూర్’

‘రొమాంటిక్’ మూవీ ప్రమోషన్లలో భాగంగా హీరో హీరోయిన్లను డార్లింగ్ ప్రభాస్ ఇంటర్వూ చేశారు..

Prabhas : ‘హాయ్ మేడమ్.. ఐ యామ్ ప్రభాస్ ఫ్రమ్ మొగల్తూర్’

Prabhas Ketika

Prabhas: టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా అండ్ గ్లోబల్ స్టార్.. మన డార్లింగ్ ప్రభాస్ వ్యక్తిత్వం గురించి, ఆయన ప్రేమతో పెట్టే ఫుడ్ గురించి ఇప్పటివరకు ఎతోమంది సెలబ్రిటీలు కథలు కథలుగా చెప్పారు. డార్లింగ్‌లో మాంచి హ్యూమర్ యాంగిల్ కూడా ఉంది.

Prabhas : ఆ పిల్ల బాత్రూంలో నేనెందుకుంటాన్రా?..

తనను దగ్గరినుండి చూసిన వాళ్లకీ విషయం బాగా తెలుసు. రీసెంట్‌గా ‘రొమాంటిక్’ మూవీ ప్రమోషన్లలో భాగంగా హీరో హీరోయిన్లను ప్రభాస్ ఇంటర్వూ చేశారు. సినిమా విషయాలు అడుగుతూనే ఇద్దరి హాబీలు, ఫుడ్ హ్యాబిట్స్ వంటి విషయాలు కూడా అడిగారు. తన స్టైల్‌లో పంచ్‌లు పేల్చి అలరించారు.

Prabhas : ఆ పిల్ల బాత్రూంలో నేనెందుకుంటాన్రా?..

ఇంటర్వూ స్టార్టింగ్‌లో నేను ఇంటర్వూ చేస్తున్నందుకు ఖాళీ టైం చూసుకుని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటూ అదిరిపోయే పంచ్ ఇచ్చిన ప్రభాస్.. ఆకాష్‌ది తనది ఒకే ఏజ్ అంటూ ఆటపట్టించారు. ఇక అమ్మాయి పేరేంటని ఆకాష్‌ని అడిగారు. ఆకాష్.. కేతిక అని బదులిచ్చాడు.

Shanmukh Jaswanth : వాళ్లిద్దరికీ ఇష్టమైతే మాక్కూడా ఇష్టమే

కేతిక.. ‘హాయ్ సార్.. ఐ యామ్ కేతిక ఫ్రమ్ న్యూఢిల్లీ’.. అంటూ డార్లింగ్‌కి తనను తాను పరిచయం చేసుకుంది. వెంటనే ప్రభాస్.. ‘హాయ్ మేడమ్.. ఐ యామ్ ప్రభాస్ ఫ్రమ్ మొగల్తూర్’ అనేశారు. వెంటనే కేతిక.. ‘సార్, యువర్ నాట్ ఓన్లీ మొగల్తూర్ సార్.. యువర్ యూనివర్సల్ స్టార్’ అంటూ ప్రభాస్‌తో ఇలా కలవడం హ్యాపీగా ఉందంటూ చాలా ఎగ్జైటెడ్‌గా చెప్పుకొచ్చింది. అక్టోబర్ 29న ‘రొమాంటిక్’ థియేటర్లలోకి రాబోతోంది.