రాముడిగా ప్రభాస్ ఇలా ఉంటాడు!..

  • Published By: sekhar ,Published On : August 18, 2020 / 11:58 AM IST
రాముడిగా ప్రభాస్ ఇలా ఉంటాడు!..

టాలీవుడ్ రెబల్ స్టార్, బాహుబలి చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయిపోయింది. డార్లింగ్ డైరెక్ట్ బాలీవుడ్ మూవీగా ‘ఆదిపురుష్‌’ అనే భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. టీ సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. హిందీ, తెలుగు భాష‌ల్లో తెరకెక్క‌నున్న ఈ చిత్రాన్ని తమిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో అనువాదం చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని త్రీడీలో రూపొదించ‌నుండ‌టం విశేషం. భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నపౌరాణిక‌ చిత్ర‌మిది. రామాయ‌ణాన్నే ‘ఆదిపురుష్’ అని తెర‌కెక్కిస్తార‌ని వార్త‌లు వినిపి‌స్తున్నాయి. ఈ విష‌యాన్ని పోస్ట‌ర్ ద్వారానే యూనిట్ అనౌన్స్ చేసింది.



పోస్ట‌ర్‌లో రాముడు, రావ‌ణాసురుడు, హ‌నుమంతుడు పాత్ర‌ల‌ను ఎలివేట్ చేయ‌డం ద్వారా సినిమా జోన‌ర్‌ను రివీల్ చేశారు. సినిమాలో ప్రభాస్ హీరో కాబట్టి రాముడిగా కనిపిస్తారు. అయితే ప్రభాస్ రాముడి గెటప్‌లో ఎలా ఉంటాడు?.. అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. రామావతార్‌లో ప్రభాస్ ఎలా ఉంటాడు అంటూ ఓ అభిమాని ప్రభాస్‌ని రాముడిగా మార్చి ఓ పోస్టర్ డిజైన్ చేశాడు.



రాముడి గెటప్‌లో విల్లు ఎక్కుపెట్టిన ప్రభాస్ అచ్చు రాముడిలా బాగా సెట్ అయ్యాడు. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఆదిపురుష్’లో రావణాసురుడు, హనుమంతుడు, సీత పాత్రల్లో ఎవరు నటిస్తారనేది మరింత ఆసక్తిగా మారింది.Prabhas