Project K: రూమర్స్‌కు చెక్.. ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో ప్రభాస్!

రాధేశ్యామ్ గ్యాప్ తర్వాత ప్రాజెక్ట్ కే షూటింగ్ లో పాల్గొటున్నారు ప్రభాస్.. స్పెయిన్ లో ఆపరేషన్, ప్రభాస్ కి హెల్త్ ఇష్యూస్ లాంటి రూమర్స్ కి చెక్ పెడుతూ షూట్ కి అటెండ్ అవుతున్నారు రెబల్ స్టార్. ఇంతకీ ప్రాజెక్ట్ కే షూటింగ్ ఎక్కడ జరుగుతుంది?

Project K: రూమర్స్‌కు చెక్.. ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో ప్రభాస్!

Projectk

Project K: రాధేశ్యామ్ గ్యాప్ తర్వాత ప్రాజెక్ట్ కే షూటింగ్ లో పాల్గొటున్నారు ప్రభాస్.. స్పెయిన్ లో ఆపరేషన్, ప్రభాస్ కి హెల్త్ ఇష్యూస్ లాంటి రూమర్స్ కి చెక్ పెడుతూ షూట్ కి అటెండ్ అవుతున్నారు రెబల్ స్టార్. ఇంతకీ ప్రాజెక్ట్ కే షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? ఎవరెవరు ఈ షూట్ లో పాల్గొంటున్నారు? ఇలాంటి ఫుల్ డిటైల్స్ స్టోరీలో చూద్దాం.

Project K : ప్రభాస్ బ్యాక్ టు షూట్.. ప్రాజెక్ట్ K..

బాహుబలి సిరీస్ తర్వాత పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న గ్లోబల్ స్టార్ ను బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్సే పలకరించాయి. అనుకున్న రేంజ్ సక్సెస్ రాకపోవడంతో తన ఇమేజ్ ను కాపాడుకోవడానికి, ఇప్పుడు ఆచితూచి అడుగేయాల్సిన పరిస్తితి వచ్చింది. దాంతో కొంత గ్యాప్ తీసకుని మళ్లీ షూటింగ్ మొదలు పెట్టేశాడు పాన్ ఇండియా స్టార్. ప్రజెంట్ నాగ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ప్రాజెక్ట్ కే పట్టాలెక్కించారు. యూనివర్శల్ సబ్జెక్ట్, మెగా బడ్జెట్ తో ప్రాజెక్ట్ కే పాన్ ఇండియా మూవీగా వస్తోంది. మే 2 నుంచే ప్రాజెక్ట్ కే షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది.

Project K: మీలో ఆ ట్యాలెంట్ ఉంటే.. ప్రభాస్ సినిమాలో బంపరాఫర్!

ఇక ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్స్ బిగ్ బి అమితాబ్ తో పాటు దీపికా పదుకోన్ లాంటి బిగ్ స్టార్ క్యాస్టింగ్ ఉంది. ఇంకా భారీ సంఖ్యలో అప్ కమింగ్ ఆర్టిస్ట్ లను కూడా ఈ మధ్య ఆడిషన్ చేసి మరీ తీసుకున్నారు టీమ్. ప్రాజెక్ట్ కే సినిమా కోసం తోట తరణి ఆర్ట్ డైరెక్షన్ లో హైదరాబాద్ లో మూడు సెట్స్ వేశారు. ఈ సినిమాకు సంబంధించిన మేజర్ పార్ట్ షూటింగ్ ఈ సెట్స్ లోనే చేయబోతున్నారు. ఇంకా ఈ షెడ్యూల్ లో అమితాబ్, దీపికాల కాంబినేషన్ లో ప్రభాస్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. రాధేశ్యామ్ తర్వాత సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే ఇలా అన్ని భారీ బడ్జెట్ సినిమాలే చేస్తున్న ప్రభాస్ ఈ మూడు సినిమాల పైన చాలా ఆశలు పెట్టుకున్నారు.

Project K: హెల్ప్ ప్లీజ్ అంటూ హైప్ పెంచిన అశ్విన్.. అసలేంటి ప్రాజెక్ట్ కె?

మళ్లీ ఈ మూడు సినిమాలతో, బాహుబలి 2 రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవుతాడని ఆయన ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆమధ్య ప్రభాస్ కాలు సర్జరీ చేయించుకున్నారని, ఇంకా వెయిట్ తగ్గే ట్రీట్ మెంట్ చేపించుకున్నారని ఇలా రకరకాలుగా ప్రభాస్ ఆరోగ్యంపైన వదంతులు వినిపించాయి. డార్లింగ్ ఫ్యాన్స్ కొంత ఆందోళన చెందారు కూడా. లేటెస్ట్ గా ప్రాజెక్ట్ కే షూటింగ్ షెడ్యూల్ మొదలవడంతో, అప్పడు వినిపించిన వదంతులన్నీ పటాపంచలైపోయాయి. దాంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.