Prabhas: ప్రభాస్ మారుతి సినిమా వచ్చేది అప్పుడేనా? | Prabhas Maruthi Movie To Come At This Time

Prabhas: ప్రభాస్ మారుతి సినిమా వచ్చేది అప్పుడేనా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ K ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఈ సినిమాల్లో ఆదిపురుష్ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని....

Prabhas: ప్రభాస్ మారుతి సినిమా వచ్చేది అప్పుడేనా?

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ K ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఈ సినిమాల్లో ఆదిపురుష్ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక మిగతా రెండు సినిమాలు మాత్రం షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఈ సినిమాలతో పాటు మరో దర్శకడు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Prabhas : ప్రాజెక్ట్ K సెట్‌లో RRR…

కానీ.. ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కుతుందో లేదో అని అందరూ సందేహిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటికే కమిట్ అయిన రెండు భారీ ప్రాజెక్టులు ఇంకా షూటింగ్ జరుపుకుంటుండటంతో మారుతితో సినిమా ఇప్పట్లో వస్తుందో లేదో అని అనుకుంటున్నారు. అయితే.. అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చేలా, ప్రభాస్ ఈ సినిమాను చాలా స్పీడుగా ప్రారంభించడమే కాకుండా అంతే స్పీడుగా ముగించాలని చూస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను వచ్చే వేసవి తరువాత స్టార్ట్ చేసి 2024 సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Prabhas : మరో ప్రాజెక్టుకి లైన్ క్లియర్ చేసిన ప్రభాస్.. ఈ లైనప్ ఏంటి బాబు..

ఈలోపు సలార్ చిత్రాన్ని ముగించేసి, రిలీజ్‌కు రెడీ చేయాలని ఆయన భావిస్తున్నాడట. అయితే మారుతి సినిమా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని, ఈ సినిమాలో ప్రభాస్ అల్టిమేట్ కామెడీతో ప్రేక్షకులను మెప్పిస్తాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సినిమాను అనుకున్న సమయానికి ప్రారంభిస్తారా లేదా అనేది చూడాల్సి ఉందని సినీ క్రిటిక్స్ అంటున్నారు.

×