Prabhas: మే నెలలో భయపట్టేందుకు రెడీ అవుతున్న ప్రభాస్.. నిజమేనా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సలార్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో పాటు దర్శకుడు మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ నెక్ట్స్ మూవీని తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Prabhas: మే నెలలో భయపట్టేందుకు రెడీ అవుతున్న ప్రభాస్.. నిజమేనా?

Prabhas Maruthi Movie To Get Release In May

Prabhas: ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యేలా చేసింది. ఈ సినిమాను కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో సెట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Prabhas : ‘సాచి’ ట్రైలర్ లాంచ్ చేసిన సలార్ స్టార్ ప్రభాస్..

అయితే, సలార్ సినిమా కంటే ముందే, ప్రభాస్ థియేటర్లలో వాలిపోయేందుకు రెడీ అవుతున్నాడట. దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. హార్రర్ కామెడీ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దుతున్నాడట మారుతి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఏకంగా ముగ్గురు భామలు హీరోయిన్లుగా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో వర్సటైల్ యాక్టర్ సత్యరాజ్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌లు కూడా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో మంచి హైప్ క్రియేట్ కావడంతో ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Prabhas : అద్దంలో చూసుకున్నప్పుడు ఆయన గుర్తుకు రావడానికి గడ్డం పెంచుతా.. ప్రభాస్!

మే నెలలో ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తే, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కుతుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. మరి నిజంగానే ఈ సినిమాను సలార్ మూవీ కంటే ముందే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.