Prabhas : వచ్చే నెలలోనే ప్రభాస్ – మారుతి సినిమా మొదలు

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అన్నీ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులే ఉన్నాయి. రాధేశ్యామ్ రిజల్ట్ తో వీటి మధ్య ఒక చిన్న సినిమా అయినా చేయాలని డిసైడ్ అయ్యాడు ప్రభాస్.

Prabhas : వచ్చే నెలలోనే ప్రభాస్ – మారుతి సినిమా మొదలు

Prabhas

 

Prabhas :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల వచ్చిన ‘రాధేశ్యామ్’తో మెప్పించలేకపోయాడు. కలెక్షన్ల పరంగా ఈ సినిమా పెద్ద నష్టాన్నే చూసింది. ప్రతి సినిమాకి ప్రభాస్ పై భారీ హైప్ పెంచేయడం వల్ల అంచనాలు అందుకోకపోతే ఇలాగే అవుతుందని భావించారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అన్నీ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులే ఉన్నాయి. రాధేశ్యామ్ రిజల్ట్ తో వీటి మధ్య ఒక చిన్న సినిమా అయినా చేయాలని డిసైడ్ అయ్యాడు ప్రభాస్.

దీంతో అసలు ప్రభాస్ లైనప్ లో లేని డైరెక్టర్ ని తీసుకొచ్చారు. చిన్న సినిమాలతో, తక్కువ బడ్జెట్ తో అందర్నీ నవ్వించే మారుతి ప్రభాస్ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ కి చాలా క్లోజ్. దీంతో త్వరత్వరగా ప్రభాస్ – మారుతి సినిమాని లైన్ లో పెట్టేశారు. చాలా తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాని పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే మారుతి ప్రభాస్ కి కథ చెప్పటం, ఓకే చెయ్యటం అయిపొయింది. దీనికి రాజా డీలక్స్ అనే పేరు కూడా అనుకుంటున్నారు.

BiggBoss Non Stop : ఈ వారం బిగ్‌బాస్‌ నుంచి తేజస్విని అవుట్

అయితే ఈ సినిమాని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసేయాలని ప్రభాస్, యూవీ క్రియేషన్స్ భావిస్తున్నాయి. దీంతో ఈ సినిమా ఈ నెలలోనే మొదలవ్వనున్నట్టు వినిపిస్తుంది. ఈ నెల 10వ తేదీన పూజ కార్యక్రమాలు నిర్వహించి వచ్చే నెల నుంచే చిత్రీకరణ మొదలు పెట్టనున్నట్టు సమాచారం. హారర్‌, కామెడీ కథతో, మారుతి మార్క్‌ వినోదంతో ఈ సినిమా ఉండబోతుంది. ఈ సినిమాతో మళ్ళీ పాత ప్రభాస్ ని చూపిస్తారేమో చూడాలి.