Viral News: బెంగాల్ పులికి ప్రభాస్ పేరు.. ఇదెక్కడి ఎలివేషన్ బాబోయ్!

రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు ఈ పేరు పాన్ ఇండియా స్థాయిలో పరిచయమే అక్కర్లేదు. ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌ ఇప్పుడు వరస పాన్ ఇండియా సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.

Viral News: బెంగాల్ పులికి ప్రభాస్ పేరు.. ఇదెక్కడి ఎలివేషన్ బాబోయ్!

Viral News

Viral News: రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు ఈ పేరు పాన్ ఇండియా స్థాయిలో పరిచయమే అక్కర్లేదు. ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌ ఇప్పుడు వరస పాన్ ఇండియా సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. ప్రభాస్ స్టార్ డమ్ గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఒక సరైన హిట్ సినిమా పడితే చాలు అవలీలగా 1000 కోట్ల వసూళ్లను రాబట్టే సత్తా ఇప్పుడు ప్రభాస్ సొంతం. రాధేశ్యామ్ తో కాస్త లైనప్ తడబడినా క్రేజ్ మాత్రం తగ్గేలా లేదు.

Prabhas: సోలోగా కానిచ్చేస్తున్న ప్రభాస్..?

వచ్చే పాన్ ఇండియా సినిమాలలో ఒక్క హిట్టు చాలు మళ్ళీ ప్రభాస్ ప్రభంజనం కొనసాగేందుకు ఏ అడ్డు ఉండదు. హిట్టు ఫట్టుతో సంబంధం లేకుండా క్రేజ్ సెట్ చేసిన ప్రభాస్ కోసం అభిమానులు ఎంతగా తపిస్తారో ఇప్పటికే మనం చాలాసార్లు చూసేశాం. అయితే, తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అంశం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. మన స్టార్ హీరోలని సినిమాల్లో ఎలివేట్ చెయ్యడానికి కొన్ని పవర్ ఫుల్ యానిమల్స్ తో పోల్చిన డైలాగ్స్ వింటూ ఉంటాం. కానీ రియల్ లైఫ్ లో ఒక రాయల్ బెంగాల్ టైగర్ కి ప్రభాస్ అని పేరు పెట్టడం మాత్రం ఆసక్తిగా ఉంది.

Prabhas: మరో నెల రెస్ట్ మోడ్‌లోనే ప్రభాస్.. అసలేం జరుగుతోంది?

ఔను నిజమే.. పవర్ ఫుల్ యానిమల్ బెంగాల్ టైగర్ కు ప్రభాస్ పేరు పెట్టేశారు. హైదరాబాద్ నెహ్రు జూలాజికల్ పార్క్ లో పులి బోనుకి బోర్డు పెట్టి దానికి బ్రాకెట్ లో ప్రభాస్ పేరు కూడా పెట్టారు. దీనితో ఈ అంశం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇలాంటి ఎలివేషన్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే మరో హీరోకు దక్కలేదని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. అయితే, అసలు ఇది నిజంగా జూ పార్క్ యాజమాన్యమే ఇలా పెట్టిందా.. లేక ఎవరైనా అభిమానులు ఇలా బోర్డు పెట్టారా అన్నది స్పష్టత లేదు.