డార్లింగ్ న్యూ లుక్ అదిరిందిగా!

డార్లింగ్ న్యూ లుక్ అదిరిందిగా!

Prabhas New Look: రెబల్‌స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వరుసగా భారీ ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్నారు. రాధకృష్ణ దర్శకత్వంలో నటించిన ‘రాధే శ్యామ్’ రిలీజ్‌కి రెడీ అవుతుండగా.. ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న ‘సలార్’ షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయ్యింది. నాగ్ అశ్విన్‌తో చేస్తున్న మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

Prabhas New Look

వీటితోపాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆదిపురుష్’లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది డార్లింగ్ హిందీ డెబ్యూ మూవీ.. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్.. రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమా ప్రకటించినప్పటి నుండి రాముడిగా ప్రభాస్ ఇలా ఉంటాడు అంటూ పలు ఫ్యాన్ మేడ్ పోస్టర్లు దర్శనమిచ్చాయి.

ఇక రీసెంట్‌గా బయటకొచ్చిన ప్రభాస్ న్యూ లుక్ తెగ వైరల్ అవుతోంది. కోర మీసాలతో, హ్యాట్, గాగుల్స్‌తో డార్లింగ్ లుక్ కిరాక్ ఉంది అసలు.. ఫ్యాన్స్ ‘ఆదిపురుష్’ లో రాముడి క్యారెక్టర్ కోసమే ప్రభాస్ మీసాలు పెంచి కొత్త లుక్‌లోకి మారిపోయాడంటూ ఈ ఫొటోను బాగా వైరల్ చేస్తున్నారు.

Prabhas New Look