Prashanth Neel: ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్.. ప్రశాంత్ లైనప్ అదిరిందంతే!

కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. చేసింది రెండే రెండు సినిమాలు.. మూడో సినిమా కెజిఎఫ్ 2 ఇంకా రిలీజే కాలేదు. తెలుగులో ఎప్పటి నుంచో సినిమా చెయ్యాలని చూస్తున్న ప్రశాంత్.. కెజిఎఫ్ తో..

Prashanth Neel: ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్.. ప్రశాంత్ లైనప్ అదిరిందంతే!

Prashanth Neel

Prashanth Neel: కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. చేసింది రెండే రెండు సినిమాలు.. మూడో సినిమా కెజిఎఫ్ 2 ఇంకా రిలీజే కాలేదు. తెలుగులో ఎప్పటి నుంచో సినిమా చెయ్యాలని చూస్తున్న ప్రశాంత్.. కెజిఎఫ్ తో తన సత్తా చూపించాడు. ఆ సక్సెస్ తో ఇంప్రెస్ అయిన టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రశాంత్ నీల్ తో సినిమా చెయ్యడానికి సై అంటున్నారు. ప్రజెంట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్. ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి పవర్ ఫుల్ హీరోలతో మ్యాసివ్ మాస్ స్టోరీస్ తో ఆడియన్స్ ముందుకు రావడానికి ప్లాన్ రెడీ చేసుకున్న ఈ కన్నడ డైరెక్టర్ మరో టాలీవుడ్ టాప్ హీరోతో సినిమా ఛాన్స్ కొట్టేశాడు.

Jr NTR-Allu Arjun: వెకేషన్ టైమ్.. ఫ్యామిలీతో చిల్ అవుతున్న స్టార్లు!

ఆల్రెడీ ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు ఓకే చేయించుకున్న ఈ కన్నడ డైరెక్టర్ లేటెస్ట్ గా మరోస్టార్ హీరో రామ్ చరణ్ ని బుట్టలో వేసేశాడు. కెజిఎఫ్ 2 కంప్లీట్ అయ్యిందో లేదో.. ప్రభాస్ తో సలార్ మూవీని ఓకే చేయించుకుని ఆల్రెడీ షూటింగ్ ని స్పీడప్ కూడా చేశాడు ప్రశాంత్ నీల్. మైత్రి మూవీస్ బ్యానర్ లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అంతలోనే రామ్ చరణ్ ని లైన్లో పెట్టేశారు ప్రశాంత్ నీల్. తండ్రీ కొడుకుల ఎమోషన్ తో సాగే కథకి ఆల్రెడీ చరణ్ ఓకే కూడా చెప్పేశాడని, చరణ్ 17వ సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లోనే తెరకెక్కుతోందంటూ టాలీవుడ్ లో న్యూస్ నడుస్తోంది.

Seerat Kapoor: చూపులతో మాయచేయగల ముంబై భామ సీరత్!

ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలను హ్యాండిల్ చెయ్యడం అంత ఈజీ కాదు. డేట్స్ ఉన్నా, ఎంత డబ్బున్నా.. ఈ స్టార్ హీరోల స్టామినాని స్క్రీన్ మీద చూపించడం అందరు డైరెక్టర్స్ కి సాధ్యం కాదు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ఆ ధైర్యం చేస్తున్నాడు. ప్రభాస్ తర్వాత అంతటి మాస్ అప్పీల్, స్టేచర్ ఉన్న టాలీవుడ్ మాస్ హీరో ఎన్టీఆర్ సినిమాకి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటూనే చరణ్ స్టోరీ రెడీ చేసేశారు. ప్రజెంట్ ప్రభాస్ తో చేస్తున్న సలార్ సినిమా కంప్లీట్ అయ్యాక ఎన్టీఆర్ సినిమా.. ఆ తర్వాత చరణ్ తో సినిమా వరసగా తెరకెక్కించబోతున్నాడు ప్రశాంత్ నీల్.