Prabhas : ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో మరో సినిమా.. నిజమేనా?

రెబల్ స్టార్ ప్రభాస్, కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'సలార్'. జీఎఫ్ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తుండడంతో.. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ ఇద్దరి కాంబినేషన్ గురించి మరో న్యూస్ ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

Prabhas : ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో మరో సినిమా.. నిజమేనా?

Prabhas once again collaborate with prasanth neel

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్, కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘సలార్’. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. కేజీఎఫ్ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తుండడంతో.. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ ఇద్దరి కాంబినేషన్ గురించి మరో న్యూస్ ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

Prabhas : ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ అప్డేట్ ఇచ్చిన నిర్మాత..

వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయబోతున్నారు అని తెలుస్తుంది. ‘రావణం’ అనే టైటిల్ ని కూడా ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతుంది. సలార్ పూర్తి అవ్వగానే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా, ఆ తరువాత కేజీఎఫ్-3 చేయనున్నాడు. ఈ రెండు చిత్రాలు తరువాతే ‘రావణం’ సినిమా పట్టాలు ఎక్కనుంది. ఈ సినిమాని తెలుగు బడా నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ప్రభాస్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు, ఈ సినిమా లార్జర్ థన్ లైఫ్’ అంటూ వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మరోసారి ఈ విషయాన్ని దిల్ రాజు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇక ఈ వార్త విన్న ప్రభాస్ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్-K, మారుతీ సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ ఏడాది చివరిలో సందీప్ రెడ్డి వంగాతో చేయబోతున్న స్పిరిట్ సినిమాని కూడా పట్టాలు ఎక్కించబోతున్నట్లు నిర్మాత భూషణ్ కుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ మూవీలో ప్రభాస్ మొదటిసారిగా పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు.