ప్రభాస్ ఆది పురుష్..ఇంట్లోనే విలువిద్య ట్రైనింగ్

10TV Telugu News

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాణాలు ఎలా ప్రయోగించాలనే దానిపై ట్రైనింగ్ తీసుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా ఇంట్లోనే ఓ సెట్ వేసుకుని ఓ ట్రైనర్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన శిక్షణను త్వరలోనే ప్రారంభించనున్నారని తెలుస్తోంది.ట్రైనింగ్ లో బాణాలు ప్రయోగించడం, ఇతర వాటిపై శిక్షణ తీసుకోనున్నారు ప్రభాస్. వచ్చే ఏడాది ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ప్రారంభం కానుంది. బాహుబలి కోసం యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు డార్లింగ్. ఇప్పుడు ఆది పురుష్ లోని కొన్ని కీలక యుద్ధ సన్నివేశాల కోసం విలువిద్య నేర్చుకోనున్నాడు. మంచి బాడీ ఫిట్‌నెస్ కోసం ట్రైనర్ సమక్షంలో వర్కౌట్స్ చేస్తున్నాడు.

కరోనా వైరస్ కారణంగా..సినిమా షూటింగ్ లు గత కొన్ని నెలలుగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో నటులంతా..ఇంట్లోనే ఉండిపోయారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సినిమా షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభాస్ కూడా కొన్ని సినిమాలకు సైన్ చేశారు.అందులో కీలకం ఆది పురుష్ సినిమా. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆదిపురుష్’లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్.. రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు.
https://10tv.in/ala-vaikunthapurramuloo-sets-highest-trp-record-for-a-telugu-film/
ప్రభాస్ హైట్, ఫిజిక్ రాముడిలా ఉంటాయి.. వ్యక్తిగతంగా కూడా తనలో రాముడి లక్షణాలున్నాయి అందుకే అతణ్ణి ఆ క్యారెక్టర్ కోసం తీసుకున్నామని ఓం రౌత్ అన్నారు. రాముడి పాత్రలో ధీరుడిగా కనిపించేందుకు ప్రభాస్ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడట.ప్రభాస్ జస్ట్ పర్‌ఫెక్ట్. అతని పర్సనాలిటీ వ్యక్తిత్వం అంతా ప్రశాంతంగా ఉంటుంది. అతను అలా ఉన్నాడు కాబట్టే ఆదిపురుష్ కు తనను ఎంపిక చేశాం. లేదంటే అతని జోలికే వెళ్లేవాళ్లం కాదు అని చెప్పుకొచ్చారు ఓం రౌత్.

10TV Telugu News