Prabhas : 2023 సమ్మర్‌లో ప్రభాస్ ‘ప్రాజెక్ట్‌ K’ విడుదల

అశ్వినీదత్ మాట్లాడుతూ.. ‘ప్రాజెక్ట్‌ K’కు సంబంధించి ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తయ్యాయి. కరోనా తగ్గుముఖంలో ఉండి పరిస్థితులు సహకరిస్తే ఈ నెలాఖర్లో కొత్త షెడ్యూల్‌ను..............

Prabhas :  2023 సమ్మర్‌లో ప్రభాస్ ‘ప్రాజెక్ట్‌ K’ విడుదల

Project K

Prabhas :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ఈ సంక్రాంతికి ‘రాధేశ్యామ్’ విడుదల అవ్వాల్సి ఉన్నా కరోనా దృష్ట్యా వాయిదా వేశారు. ‘రాధేశ్యామ్’ ఈ సమ్మర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ‘ఆదిపురుష్’ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘సలార్’ సినిమా మరి కొంతభాగం షూటింగ్ మిగిలి ఉంది. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్‌ K’ ఇటీవల షూటింగ్ మొదలై రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ‘ప్రాజెక్ట్‌ k’ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పడుకునే నటిస్తుంది. అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషించనున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

Allu Arjun : ‘రౌడీబాయ్స్’ ఈవెంట్లో ‘శ్యామ్ సింగరాయ్’ని పొగిడిన ఐకాన్ స్టార్

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ‘ప్రాజెక్ట్‌ K’ నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమా గురించి మాట్లాడారు. అశ్వినీదత్ మాట్లాడుతూ.. ‘ప్రాజెక్ట్‌ K’కు సంబంధించి ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తయ్యాయి. కరోనా తగ్గుముఖంలో ఉండి పరిస్థితులు సహకరిస్తే ఈ నెలాఖర్లో కొత్త షెడ్యూల్‌ను మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే దీపిక, ప్రభాస్ మీద సన్నివేశాల్ని చిత్రీకరించాం. తర్వాతి షెడ్యూల్‌లో అమితాబ్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. అన్నీ సవ్యంగా సాగితే 2023 వేసవిలో ‘ప్రాజెక్ట్‌ K’ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని అన్నారు.