Prabhas : డిసెంబర్‌ నుంచి ‘ప్రాజెక్టు K’ చిత్రీకరణ.. జెట్‌స్పీడ్‌లో ప్రభాస్

మహానటి డైరెక్టర్ నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ ‘ప్రాజెక్ట్‌-కె’ అనే సినిమాని ఓకే చేశాడు. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో భారీ సాంకేతిక హంగులతో ఈ చిత్రాన్ని...........

Prabhas : డిసెంబర్‌ నుంచి ‘ప్రాజెక్టు K’ చిత్రీకరణ.. జెట్‌స్పీడ్‌లో ప్రభాస్

Prabhas (1)

Prabhas :  యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకపక్క సినిమా షూటింగ్స్ చేస్తూ ప్రభాస్ బిజీగా ఉంటే మరో పక్క షూటింగ్ అయిపోయిన సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ తో బిజీగా ఉన్నాయి. జనవరిలో సంక్రాంతికి ‘రాధేశ్యామ్’ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇప్పటికే ‘ఆదిపురుష్’ షూటింగ్ కూడా పూర్తి అయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ షూటింగ్ జరుగుతుంది. ఇవి కాక మరో రెండు సినిమాలని కూడా ఓకే చేశాడు.

Kangana Ranaut : కంగనాపై కేసు నమోదు చేయండి – నాంపల్లి కోర్టు ఆదేశం

మహానటి డైరెక్టర్ నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ ‘ప్రాజెక్ట్‌-కె’ అనే సినిమాని ఓకే చేశాడు. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో భారీ సాంకేతిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా కోసం దాదాపు 300 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారు. బాలీవుడ్ స్టార్లు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టనున్నారు.

Telugu Stars: నెక్స్ట్ ఏంటి.. కన్ఫ్యూజన్‌తో జుట్టు పీక్కుంటున్న ఫ్యాన్స్!

డిసెంబర్‌ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారని సమాచారం. అయితే మొదట ప్రభాస్ లేని సీన్స్ అన్ని షూట్ చేయనున్నారు. ప్రభాస్ ‘సలార్’ షూటింగ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడు. ‘సాహో’ తర్వాత ఇన్ని భారీ బడ్జెట్ సినిమాలని ఒకేసారి లైన్లో పెట్టడమే కాకుండా అన్ని వరుసగా షూటింగ్స్ కంప్లీట్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు ప్రభాస్. ఇక సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చే ప్రభాస్ 25వ సినిమా ‘స్పిరిట్’ 2022లో షూటింగ్ ప్రారంభమవ్వనుంది.